Jailer: రికార్డులు బ్రేక్ చేస్తున్న జైలర్.. ఇదీ సార్ తలైవా రేంజ్..
మొత్తానికి ఇప్పుడు రజినీ బాక్సాఫీస్‌కు తన సత్తాను చాటుతూ అర్థమైందా రాజా అనేట్టుగా చేశాడు. జైలర్ సినిమాతో డే వన్ రికార్డులు లేచిపోతోన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రజినీ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు జైలర్ మొదటి రోజు కలెక్షన్లను చూస్తే రజనీ కమ్ బ్యాక్ ఇచ్చినట్టే అనిపిస్తోంది.
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా చాలు.. రికార్డులు లేచిపోతాయి. తలైవా రజినీ బాక్సాఫీస్‌కు తన స్టామినా చూపించి చాలా రోజులే అయింది. మొత్తానికి ఇప్పుడు రజినీ బాక్సాఫీస్‌కు తన సత్తాను చాటుతూ అర్థమైందా రాజా అనేట్టుగా చేశాడు. జైలర్ సినిమాతో డే వన్ రికార్డులు లేచిపోతోన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రజినీ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు జైలర్ మొదటి రోజు కలెక్షన్లను చూస్తే రజనీ కమ్ బ్యాక్ ఇచ్చినట్టే అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు బాగానే వచ్చాయి. నైజాంలో మొదటి రోజే రూ.3.21 కోట్లు, సీడెడ్‌లో రూ.94 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.81 లక్షలు, ఈస్ట్ రూ.40 లక్షలు, వెస్ట్ రూ.33 లక్షలు, గుంటూరు రూ.65 లక్షలు, కృష్ణా రూ.45 లక్షలు, నెల్లూరు రూ.22 లక్షలు ఇలా మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.7.01 కోట్ల షేర్ రాబ్టటి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ రేంజ్‌లో కలెక్షన్లు వస్తాయని, ఓపెనింగ్స్‌లో అదరగొడుతుందని ట్రేడ్ వర్గాలు సైతం అంచనా వేయలేదట. ఈ సినిమాను తెలుగులో రూ.12 కోట్లకే అమ్మేశారట. అంటే పదమూడు కోట్ల షేర్ రాబడితే.. సినిమా హిట్టుగా నిలుస్తుంది.
ఈ లెక్కన మొదటి రోజే యాభై శాతానికి పైగా రికవరీ చేసినట్టు అయింది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. వీకెండ్ లోపే లాభాల బాట పట్టేస్తుంది. ఇక లాంగ్ వీకెండ్ కూడా బాగా కలిసి వస్తుండటంతో జైలర్ మున్ముందు పెద్ద టార్గెట్‌ను పట్టేలా కనిపిస్తోంది. వాల్డ్‌వైడ్‌గా చూసుకుంటే.. ఈ సినిమా దాదాపు రూ.90 కోట్ల గ్రాస్, రూ.44 కోట్ల షేర్ రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఒక్క తమిళ నాట నుంచే రూ.23 కోట్ల షేర్ వచ్చినట్టుగా తెలుస్తోంది.