RAM CHARAN: రామ్ చరణ్‌తో సినిమా చేస్తా.. కానీ.. అది అబద్ధం..!
చరణ్.. ఇండియన్ సినిమా గర్వించదగిన ఇంకో లెజండరీ దర్శకుడి సినిమాలో చెయ్యబోతున్నాడనే మాటలు కొన్నిరోజులుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలపై ఆ లెజండరీ దర్శకుడు స్పందించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది.

RAM CHARAN: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఆ తర్వాత ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చి బాబు దర్శత్వంలో చరణ్ ఒక సినిమాని చేస్తున్నాడు. అలాగే చరణ్.. ఇండియన్ సినిమా గర్వించదగిన ఇంకో లెజండరీ దర్శకుడి సినిమాలో చెయ్యబోతున్నాడనే మాటలు కొన్నిరోజులుగా వినిపిస్తున్నాయి.
Rakul Preet Singh: పెళ్లి కళ.. ప్రియుడితో రకుల్ డెస్టినేషన్ వెడ్డింగ్..!
ఇప్పుడు ఆ వార్తలపై ఆ లెజండరీ దర్శకుడు స్పందించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. రామ్ చరణ్.. ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించబోతున్నాడనే ఒక ప్రచారం జరిగింది. దీనిపై రాజ్ కుమార్ హిరానీ మాట్లాడుతు తాను రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాననే మాట అబద్ధమని, అలాగే అసలు చరణ్‌ని ఇంతవరకు వ్యక్తిగతంగా ఒక్కసారి కూడా కలవలేదు అని చెప్పాడు. కాకపోతే రామ్ చరణ్ గురించి తెలుసని, చాలా మంచి యాక్టర్ అని, అవకాశమొస్తే చరణ్‌తో సినిమా చేస్తాననే మాట కూడా ఆయన అన్నాడు. ఆర్ఆర్ఆర్‌లో చరణ్ నటన నచ్చిందన్నాడు. ఇప్పుడు ఈ మాటలు విన్న మెగా ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు.
ఒక వేళ చరణ్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ సెట్ అయితే.. ఆ ఇద్దరి కాంబోలో వచ్చే సినిమా ఇండియన్ సినీ పరిశ్రమలో రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు. రాజ్ కుమార్ హిరానీ తాజాగా షారుక్‌తో డంకీ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్స్ ఓ మాదిరిగానే ఉన్నాయి.