Bigg Boss 7 : రాజమాత రచ్చ.. అశ్విని పై విరుచుకుపడ్డ ప్రియాంక, శోభా, కాళ్లు మొక్కిన అశ్విని..!
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అతి పెద్ద సెలబ్రిటీ రియాల్టీ షో (Celebrity reality show) బిగ్ బాస్ (Bigg Boss) సక్సెస్ ఫుల్ గా 9 వారాలను పూర్తి చేసుకుంది. పదో వారంలోకి అడుగు పెట్టింది. ఇక బిగ్ బాస్ లో సోమవారం అంటేనే నామినేషన్ హీట్ కచ్చితంగా ఉంటుంది.

Rajmata Rachcha Priyanka Shobha Ashwini who broke her legs
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అతి పెద్ద సెలబ్రిటీ రియాల్టీ షో (Celebrity reality show) బిగ్ బాస్ (Bigg Boss) సక్సెస్ ఫుల్ గా 9 వారాలను పూర్తి చేసుకుంది. పదో వారంలోకి అడుగు పెట్టింది. ఇక బిగ్ బాస్ లో సోమవారం అంటేనే నామినేషన్ హీట్ కచ్చితంగా ఉంటుంది. అలా పదో వారం నామినేషన్స్ కూడా హోరాహోరీగా సాగాయి. హౌస్ లోని కంటెస్టెంట్స్ ఒకరికినొకరు నామినేట్ చేసుకుంటూ.. రచ్చ రచ్చ చేశారు.
పదో వారికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ బిగ్ బాస్ మొదలు పెట్టాడు. అయితే ఎప్పటిలా కాకుండా ఈ వారం మరింత భినంగా నామినేషన్స్ ప్రక్రియను చేపట్టారు. నామినేషన్స్ ప్రక్రియ విషయానికి వస్తే.. రాజమాత ప్రజా అనే కాన్సెప్టును తీసుకొచ్చాడు బిగ్ బాస్. ఈసారి నామినేషన్స్.. బిగ్ బాస్ మహరాజ్యంలో జరుగుతాయని.. ఈ రాజ్యానికి శోభా, ప్రియాంక, రతిక, అశ్వినిలు రాజమాతలు.. వాళ్ల నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పారు బిగ్ బాస్. మగ కంటెస్టెంట్లు మగవాళ్ళనే నామినేట్ చేయాలి. ఇందుకు తగిన కారణాలు చెప్పి రాజమాతలను ఒప్పించాల్సి ఉంటుంది.
Kamal New Movi : ‘థగ్ లైఫ్’ పూనకాలే.. కమల్ – మణిరత్నం’ టైటిల్ రివీల్..
ఇక నలుగురికీ సింహాసనం లాంటి కుర్చీలు వేసి నామినేషన్ ప్రక్రియను చేపట్టారు. నామినేట్ చేయాలి అనుకున్న వ్యక్తి పేరు చెప్పి వారు హౌస్ లో ఉండడానికి ఎందుకు సమర్ధులు కారో కారణాలు చెప్పాలి. దానికి అవతలి వ్యక్తి కూడా వాదించే హక్కు ఉంటుంది. చివరికి ఇద్దరి వాదనలు విని ఎవరి వాదన బలంగా ఉందో.. ఎవరి వాదనలో న్యాయం ఉందో వారికి ఈ నలుగురు రాజమాతలు ఓటేశారు. మొదట అమర్ దీప్ కు నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. భోలే ప్రతివారం నామినేషన్ అలా అయితే పంచ్‌లు వేస్తూ నవిస్తుంటాడో అదే విదంగా ఈ వారం కూడా చేస్తున్నాడు. ఆ తర్వాత శివాజీ, గౌతమ్‌ల మధ్య నామినేషన్స్ డిస్కషన్ నడిచింది. శివాజీ నామినేషన్స్ మొదలుపెడుతు పంచభూతాల సాక్షిగా అంటూ ప్రారంబించాడు. తర్వాత శోభా శెట్టి, ప్రియాంక , అశ్విని మధ్య మాటల యుద్ధం నడించింది. అశ్విని ప్రియాంక , శోభా కాళ్లకు మొక్కేసింది.
ఓ వైపు రాజమాతలు (Queen Mother) ఫుల్ ఫైర్ మీద మాటల యుద్ధానికి దిగితే… అర్జున్ సెటైర్ వేశాడు. ఇక ఫైనల్ గా రాజమాతాల్లో కూడా ఒకరు నామినేట్ కావాలి. శోభా కెప్టెన్ కాబట్టి ఆమె నామినేషన్స్ లో ఉండదు. ఇక మిగిలిన ముగ్గురిలో రతికాని నామినేషన్స్ లో ఉంచారు. ఫైనల్ గా ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి భోలే, శివాజీ, యావర్, రతిక నామినేట్ అయ్యారు. మరి ఇంటి నుంచి బయటకు ఎవరు వెళ్తారో తెలియాలంటే.. వీకెండ్ వరకు ఆగాల్సిందే.