Rakul Preet Singh: రకుల్ ప్రీత్ పెళ్లి వేదిక మార్పు.. మోదీనే కారణమా..?
డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకునే వారు వేరే దేశాలకు వెళ్లకుండా మనదేశంలోనే మంచి పర్యాటక ప్రదేశాలను సెలక్ట్ చేసుకోవాలని మోదీ ఇచ్చిన పిలుపునకు.. దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది.

Rakul Preet Singh: బడా హీరోల పక్కన యాక్ట్ చేస్తూ.. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ బ్యూటీ త్వరలో తన ప్రేమికుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకోబోతోంది. ఫిబ్రవరి చివరి వారంలో విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒకటి కావాలని డిసైడ్ అయ్యింది ఈ జంట. ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలు పెట్టేశారు. ఐతే పెళ్లి వేదిక విషయంలో ఉన్నట్లుండి మార్పులు జరిగాయ్. మ్యారేజీ విదేశాల్లో కాకుండా.. మనదేశంలోనే చేసుకోబోతున్నారు.
PAWAN KALYAN-ATLLE: క్రేజీ కాంబో.. పవన్‌తో అట్లీ మూవీ.. రూ.1000 కోట్ల బడ్జెట్
దీనికి కారణం మోదీనే అని తెలుస్తోంది. కొద్దిరోజుల కింద మోదీ లక్ష్యద్వీప్‌లో పర్యటించినప్పుడు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. లోకల్ టూరిజాన్ని ప్రోత్సహిద్దాం అంటూ మోదీ ఇచ్చిన పిలుపు మాల్దీవులకు మాడిపోయేలా చేసింది. దీంతో అక్కడి మంత్రులు కొందరు విషం కక్కారు. ఇదంతా ఎలా ఉన్నా.. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకునే వారు వేరే దేశాలకు వెళ్లకుండా మనదేశంలోనే మంచి పర్యాటక ప్రదేశాలను సెలక్ట్ చేసుకోవాలని మోదీ ఇచ్చిన పిలుపునకు.. దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. రకుల్ జంట కూడా తమ పెళ్లి విదేశాల్లో కాకుంండా.. మనదేశంలోనే గోవాలో చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మధ్యే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు హాజరైన ఈ జంట.. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
ఐతే ఇప్పుడు మోదీ పిలుపుతో వాళ్లు పెళ్లి వేదిక విషయంలో మార్పు చేసుకోవడంపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇక అటు రకుల్ చేతిలో ప్రస్తుతం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. బాలీవుడ్‌లో, తమిళంలో రెండేసి చొప్పున సినిమాలు చేస్తున్న రకుల్.. తెలుగులో మాత్రం ఏ మూవీకి సైన్ చేయలేదు. ఈ మధ్య ఆమె యాక్ట్ చేసిన అయలాన్ సినిమా తమిళనాట విడుదలై మంచి విజయం సాధించింది.