Rakul Preet Singh: పెళ్లి కళ.. ప్రియుడితో రకుల్ డెస్టినేషన్ వెడ్డింగ్..!
కొద్ది రోజుల నుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా దూరమైన ఈ హీరోయిన్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుందట. రెండేళ్లుగా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉంది రకుల్. ఈ నేపథ్యంలో తమ ప్రేమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Rakul Preet Singhl సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా.. హీరో, హీరోయిన్లు వరుసగా సింగిల్ లైఫ్‌కు గుడ్ బై చెబుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు తోడు కోరుకుంటూ మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. 2023లో వివాహ బంధంతో పలు జంటలు ఒకటి కాగా.. కొత్త సంవత్సరంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లు పెళ్లిబాట పడుతున్నారు. తాజాగా హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్ న్యూఇయర్ రోజు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది.
Devara: దండయాత్ర.. దేవర’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్..
ప్రార్థన.. ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ.. అనే డైలాగ్‌తో మనందరిని మెప్పించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన రకుల్ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయింది. ఆ తర్వాత బీటౌన్‌లో ఛాన్స్‌లు దక్కడంతో బాలీవుడ్ బాట పట్టింది ఈ బ్యూటీ. ప్రస్తుతం రెండు ఇండస్ట్రీలలో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో కొద్ది రోజుల నుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా దూరమైన ఈ హీరోయిన్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుందట. రెండేళ్లుగా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉంది రకుల్. ఈ నేపథ్యంలో తమ ప్రేమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ప్రియుడిని పెళ్లిచేసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాక ఈ జోడి.. డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేస్తుందట. గోవాను పెళ్లి వేదికగా ఫిక్స్ చేసుకున్నట్లు టాక్.
కుటుంబసభ్యులతో పాటు కొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రకుల్ పెళ్లి డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించనున్నట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం తమిళంలో అయలాన్, ఇండియన్ 2 సినిమాలు చేస్తోంది రకుల్. జాకీ భగ్నానీ ఫాల్తు, రంగ్రేజ్, యంగీస్థాన్‌తో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో హీరోగా నటించాడు. పరాజయాల కారణంగా యాక్టింగ్‌కు దూరమైన జాకీ భగ్నానీ ప్రస్తుతం సినిమా ప్రొడక్షన్‌పై దృష్టిసారిస్తున్నారు.