Rakul Preet Singh: రకుల్ పెళ్లి డేట్ ఫిక్స్.. డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడంటే
జాకీ భగ్నానితో రకుల్ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. జాకీతో రకుల్ ప్రేమలో ఉందని, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. దీనికి తగ్గట్లే అనేక ఈవెంట్లలో ఇద్దరూ కలిసి కనిపించారు.

Rakul Preet Singh: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లక్రితం వరకు వరుసగా తెలుగులో సినిమాలు చేసిన రకుల్.. కొంతకాలంగా బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. ఇటీవలే అయలాన్ మూవీతో ప్రేక్షకులు ముందుకొచ్చి, మంచి సక్సెస్ అందుకుంది. బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. ఆమె వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యం ఇస్తోంది.
MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ ఎంట్రీకి ముందే.. అమ్ముడైన సినిమా రైట్స్
జాకీ భగ్నానితో రకుల్ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. జాకీతో రకుల్ ప్రేమలో ఉందని, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. దీనికి తగ్గట్లే అనేక ఈవెంట్లలో ఇద్దరూ కలిసి కనిపించారు. దీంతో ఈ రూమర్స్ నిజమే అని చాలా మంది నమ్మారు. ఇటీవల ఈ రూమర్స్‌పై రకుల్ స్పందించింది. జాకీ భగ్నాని తనకు బాగా కావాల్సిన వ్యక్తి అని చెప్పింది. అయితే.. ప్రేమ, పెళ్లి గురించి మాత్రం చెప్పలేదు. కానీ, ఆమె సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారట. వచ్చే నెలలోనే వీరి వివాహం జరగనుందని టాక్. ఫిబ్రవరి 22న గోవాలో ప్రియుడు జాకీ భగ్నానీని రకుల్ పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది.
డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఈ జంట గోవాను ఎంచుకుందని సమాచారం. ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ పెళ్లి జరగనుంది. విశాల్ పంజాబీ.. వీరి పెళ్లి కోసం ప్రత్యేక పాటల్ని కూడా రెడీ చేస్తున్నాడట. నిజానికి గత కొన్ని నెలలుగా రకుల్ పెళ్లి టాపిక్ ట్రెండింగ్ అవుతూనే ఉంది. ఈ పెళ్లి విషయంలో త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.