Rakul Preet Singh: కొత్త పోస్ట్.. పార్లమెంట్‌కి రకుల్ ప్రీత్ సింగ్
కుమారి రకుల్ ఇటీవలే శ్రీమతి రకుల్‌గా మారింది. తన ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని ఒక ఇంటిది అయ్యింది. తాజాగా ఢిల్లీ లోని కొత్త పార్లమెంట్ భవనాన్ని జాకీతో కలిసి సందర్శించింది. ఇద్దరు ఏకంగా పార్లమెంట్ భవనం లోపలకి వెళ్లి ఫోటోలు దిగారు.

Rakul Preet Singh: ప్రస్తుత యుగం సోషల్ మీడియా యుగం. కాబట్టి సంచలనానికి ఏది అనర్హం కాదు అనే విధంగా పరిస్థితి ఉంది. కొంత మంది సినీ సెలబ్రటీస్ కూడా అందుకు తగ్గట్టే తరచు సోషల్ మీడియాలో పోస్టులు, పిక్స్‌ని షేర్ చేస్తుంటారు. ఆ విధంగా సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అవుతున్నారు. ఆ ఆనవాయితీని కంటిన్యూ చేస్తు ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టు డే టాక్ అఫ్ ది డే గా నిలిచింది.
PAWAN KALYAN: పవన్ కల్యాణ్ జస్ట్ టెన్త్ పాస్.. నో ట్రోల్స్ ప్లీజ్ !!
కుమారి రకుల్ ఇటీవలే శ్రీమతి రకుల్‌గా మారింది. తన ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని ఒక ఇంటిది అయ్యింది. తాజాగా ఢిల్లీ లోని కొత్త పార్లమెంట్ భవనాన్ని జాకీతో కలిసి సందర్శించింది. ఇద్దరు ఏకంగా పార్లమెంట్ భవనం లోపలకి వెళ్లి ఫోటోలు దిగారు. వాటిని అలా దిగి ఇలా సోషల్ మీడియాలో షేర్ చెయ్యడం ఆలస్యం వైరల్‌గా మారాయి. పైగా సత్యమేవ జయతే అనే క్యాప్షన్‌ని కూడా పోస్ట్ చేసింది. సోషల్ మీడియా ప్రేమికులు అయితే రకుల్ ఎప్పటికైనా పార్లమెంట్ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తుందేమో అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఆమె సినీ కెరీర్ గురించి చెప్పుకోవాలంటే తెలుగులో దాదాపుగా అందరి అగ్ర హీరోలందరి సరసన నటించింది.
నెంబర్ వన్ రేంజ్‌కి వెళ్లే టైంలో బాలీవుడ్‌కి జంప్ అయ్యింది. అక్కడ కొన్ని సినిమాలు చేసింది గాని బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం కమల్, శంకర్‌ల ప్రెస్టేజియస్ట్ మూవీ ఇండియన్ 2 ఒక్కటే తన చేతిలో ఉంది. త్వరలోనే విడుదలకి సిద్ధం అవుతుంది. ప్రస్తుతానికి అయితే తెలుగులో దాదాపుగా కనుమరుగు అయినట్టే. ఫ్యూచర్‌లో ఏమైనా మెరుస్తుందేమో చూడాలి.