Ram Charan: రామ్ చరణ్ సినిమాకు ఎన్ని కష్టాలో..? ఎన్ని ఇబ్బందులో..?
ఇప్పటికే రంగస్థలంతో పీరియాడిక్ కిక్ ఇచ్చాడు. తర్వాత త్రిబుల్ ఆర్ కూడా పీరియాడికల్ డ్రామానే అవ్వటం, ఇప్పుడు చేస్తున్న గేమ్ ఛేంజర్‌లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నైంటీస్ పీరియడ్‌కి సంబంధించింది కావటంతో, పీరియాడికల్ హీరోగా మారిపోతున్నాడు.
Ram Charan: రామ్ చరణ్ మరో రంగస్థలానికి సిద్ధమయ్యాడా? మళ్లీ పీరియాడిక్ డ్రామాలకే సిద్దమయ్యాడా..? ఇప్పటికే రంగస్థలంతో పీరియాడిక్ కిక్ ఇచ్చాడు. తర్వాత త్రిబుల్ ఆర్ కూడా పీరియాడికల్ డ్రామానే అవ్వటం, ఇప్పుడు చేస్తున్న గేమ్ ఛేంజర్‌లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నైంటీస్ పీరియడ్‌కి సంబంధించింది కావటంతో, పీరియాడికల్ హీరోగా మారిపోతున్నాడు.
ఉప్పెన ఫేం బుచ్చిబాబు కూడా ఇప్పుడు రామ్ చరణ్ కోసం సముద్రం ఒడ్డున కోస్తా ప్రాంతంలో సెట్ వేయిస్తున్నాడట. అంటే ఉప్పెన మత్తులోంచి ఈ దర్శకుడు ఇంకా బయటికి రాలేదా..? లేదంటే రంగస్థలానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు కాబట్టి, మరో రంగస్థలం లాంటి ప్రయోగం చేస్తున్నాడా..? ఇప్పటికే రామ్ చరణ్ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే సెంటిమెంటల్‌గా ఫ్యాన్స్ భయపడుతున్నారు. తెలుగులో ఆ దర్శకుడు చైతన్యకి తప్ప ఏ హీరోకి ఇప్పటివరకు హిట్ ఇవ్వలేదు. దీనికి తోడు మళ్లీ రంగస్థలం లాంటి మూవీ అంటే అలాంటివి తప్ప సుకుమార్ టీంకి మరోకటి రావనే కామెంట్స్ వస్తాయి.
దీనికి తోడు మొదటి సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడికి ద్వితియ విఘ్నం ఉంటుంది.. సో ఆ లెక్కన బుచ్చిబాబు రెండో మూవీ చెర్రీతో చేస్తున్నాడు. కాబట్టి ఆసెంటిమెంట్ కూడా భయపెడుతోంది. బ్రిటీష్ కాలంలో ఓ ఇండియన్.. క్రీడారంగంలో జెండా ఎగరేసేందుకు ఏం చేశాడనే కోణంలో సినిమా అనగానే, మరో లగాన్ అంటున్నారు. ఇలా రకరకాల సెంటిమెంటల్ భయాలు, లేదంటే అనుమానాలు ఈ ప్రాజెక్ట్ మీద పెరుగుతున్నాయి.