RAM CHARAN: క్లాప్ కొట్టిన వెంటనే సీక్రెట్లు రివీల్ కాబోతున్నాయా..?

ఏఆర్ రెహమాన్ అయితే ఆల్రెడీ రెండు పాటలు కంపోజ్ కూడా పూర్తి చేశాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ అయిపోయాయి. కాని, సాంగ్స్ రికార్డింగ్ మాత్రం కేవలం రెండే పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇవన్నీచూస్తే సినిమా మొదలయ్యేలోపే పోస్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్ కూడా జరుగుతోందనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 19, 2024 | 06:13 PMLast Updated on: Mar 19, 2024 | 6:14 PM

Ram Charan And Buchibabu Movie Opening On Wednesday Story Will Reveal

RAM CHARAN: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో బుచ్చి బాబు ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ పనులు మొదలయ్యాయి. బుధవారం లాంచింగ్, వన్ మంత్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఇలా సడన్‌గా ఫిల్మ్ టీం స్పీడ్ పెంచింది. ఉప్పెన తర్వాత ఎన్టీఆర్‌తో మూవీ తీయాలని ఏడాదికిపైనే వేయిట్ చేశాడు బుచ్చిబాబు. తర్వాత ఆ ప్రాజెక్ట్ చరణ్ దగ్గరకు చేరింది. తారక్ చెబితేనే రామ్ చరణ్‌కి కథ వినిపించి ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు బుచ్చిబాబు.

Jr NTR-ATLEE: మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ కాంబినేషన్.. తారక్‌-అట్లీ మూవీ మొద‌ల‌య్యేది అప్పుడే..!

ఇక అప్పుడు ఫిక్స్ చేసిన పెద్ది టైటిల్‌నే, ఇప్పుడు కూడా కంటిన్యూ చేసేలా ఉన్నారు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ని ఫైనల్ చేశారు. ఏఆర్ రెహమాన్ అయితే ఆల్రెడీ రెండు పాటలు కంపోజ్ కూడా పూర్తి చేశాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ అయిపోయాయి. కాని, సాంగ్స్ రికార్డింగ్ మాత్రం కేవలం రెండే పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇవన్నీచూస్తే సినిమా మొదలయ్యేలోపే పోస్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్ కూడా జరుగుతోందనిపిస్తోంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షెడ్యూల్ పూర్తి చేసిన ఫిల్మ్ టీం 21 నుంచి కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసింది. అదే ఆఖరి షెడ్యూల్ అని తెలుస్తోంది.

కాబట్టి.. మార్చ్ ఎండ్‌లోగా గేమ్ ఛేంజర్ పూర్తయితే, వారం గ్యాప్ తీసుకుని ఏప్రిల్ మూడో వారం నుంచి బుచ్చి బాబు తీసే పెద్ది మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. అంతేకాదు లాంచింగ్ రోజే బేసిక్ స్టోరీ లైన్ చెప్పే రాజమౌళి స్టైల్లోనే పెద్ది మూవీ స్టోరీ లైన్ ఎనౌన్స్ చేయబోతున్నాడట బుచ్చిబాబు.