Hollywood: హాలీవుడ్ కి ముగ్గురు మొనగాళ్లు..
రామ్ చరన్, ఎన్టీఆర్ ఇద్దరికీ త్రిబుల్ మూవీతో, అందులో నాటు నాటు పాటతో వరల్డ్ వైడ్ గా ఎంత గుర్తింపు వచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే హాలీవుడ్ సినీ దర్శకులు చాలామంది వీళ్లతో కలిసి సినిమా చేయాలనుంది అన్నారు. కాని సీరియస్ గా తారక్, చరణ్ ఇద్దరు అటు వైపు అడుగులు వేయలేదు.

Tollywood heros selected for Hollywood movie
కాని ఇప్పుడు అటు వైపు అడుగులు పడుతున్నాయట. ఇది కూడా దీపికా పదుకొనే భర్తవల్లే బయటికి పొక్కింది.బాలీవుడ్ యాక్టర్ రణ్ వీర్ సింగ్ హాలీవుడ్ ఏజెన్సీ విలియం మోరీస్ తో డీల్ సెట్ చేసుకున్నాడు. ఐతే అదే సంస్థతో ఎన్టీఆర్, చరణ్ డీల్ చేసుకున్నట్టు తనకి తేలటం, తను ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియాకు లీక్ చేయటంతో అలా మ్యాటర్ బయటికి పొక్కింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీకోసం రాజమౌళి కూడా తనవంతు కృషి చేస్తున్నాడట. తన డీల్ కుదుర్చుకున్న హాలీవుడ్ ఏజెన్సీ సపోర్ట్ తో చెర్రీ, తారక్ కి అక్కడ పీఆర్ టీం ని సెట్ చేశాడట జక్కన్న. ఇలా వెనకాల చాలా తతంగమే జరుగుతోంది. కాని ఏది బయటికి పొక్కలేదు. సో వన్ ఇయర్ లోగా ఏదో ఒక హాలీవుడ్ మూవీతో తారక్, చెర్రీ సర్ ప్రైజింగ్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వొచ్చని తెలుస్తోంది.