RRR Team: ఆస్కార్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకు పిలుపు..

ఆస్కార్‌ అవార్డులు అందించే అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ సైన్సెస్‌లో ప్యానెల్‌ మెంబర్స్‌గా ట్రిపులార్‌ టీం నుంచి ఆరుగురిని సెలెక్ట్‌ చేశారు. హీరోలు రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్‌ చంద్రబోస్‌, సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్‌కు ప్యానెల్‌ మెంబర్స్‌గా ప్లేస్‌ దక్కింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 29, 2023 | 04:36 PMLast Updated on: Jun 29, 2023 | 4:36 PM

Ram Charan And Jr Ntr Join The Academy As New Members

RRR Team: రిలీజై సంవత్సరం దాటినా ట్రిపులార్‌ సినిమా మేనియా ఇంకా కొనసాగుతోంది. ఎక్కడో ఒక చోట.. ఏదో ఒక విషయంలో ఈ సినిమా గురించి సినీ ప్రియులు ఇంకా మట్లాడుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే ఆస్కార్ సహా ఎన్నో అవార్డులు కొల్లగొట్టి, రికార్డులు క్రియేట్‌ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఆస్కార్‌ నుంచి మరోసారి అరుదైన గౌవరం దక్కింది.

ఆస్కార్‌ అవార్డులు అందించే అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ సైన్సెస్‌లో ప్యానెల్‌ మెంబర్స్‌గా ట్రిపులార్‌ టీం నుంచి ఆరుగురిని సెలెక్ట్‌ చేశారు. హీరోలు రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్‌ చంద్రబోస్‌, సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్‌కు ప్యానెల్‌ మెంబర్స్‌గా ప్లేస్‌ దక్కింది. ఈ విషయాన్ని రాజమౌళి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. సౌత్‌ నుంచి ఈ ప్యానెల్‌లో ప్లేస్‌ దక్కించుకున్న మొదటి వ్యక్తులు వీళ్లే. ఇక నార్త్‌ నుంచి డైరెక్టర్‌ మణిరత్నం, ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌కు కూడా ప్యానెల్‌లో చోటు దక్కింది.

ఇప్పటి నుంచి ఆస్కార్‌ అవార్డులు అందించే ప్యానెల్‌లో మన హీరోలు కూడా మెంబర్లుగా ఉంటారు. దీంతో వీళ్లందిరికీ సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెళ్లువెత్తున్నాయి. అయితే సినిమాను ఈ స్థాయికి తీసుకువెళ్లిన రాజమౌళికి చోటు దక్కకపోవడంపై ఆయన అభిమానులు డిసప్పాయింట్‌ అయ్యారు. ఆ ఆరుగురితోపాటు జక్కన్నను కూడా ప్యానెల్‌ మెంబర్‌గా సెలెక్ట్‌ చేస్తే బాగుండేదని అంటున్నారు. నిజానికి ట్రిపులార్‌ సినిమాను ఆస్కార్‌ స్థాయికి తీసుకువెళ్లేందుకు జక్కన్న చాలా కష్టపడ్డారు.

ముఖ్యంగా ఆస్కార్‌ అవార్డ్‌ వచ్చిన నాటు నాటు సాంగ్‌ విషయంలో ఆయన తీసుకున్న కేర్‌ గురించి రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. సినిమాకు ఈ స్థాయి రావడానికి అంత కష్టపడ్డ రాజమౌళికి స్యానెల్‌లో చోటు దక్కకపోవడం నిజంగా చాలా మందికి ఆశ్చర్యకరంగానే ఉంది.