Game Changer: లీకుల బెడద.. గేమ్ ఛేంజర్‌ను వదలని లీకులు..

గేమ్ చేంజర్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. రీసెంట్‌గా కొత్త షెడ్యూల్ ప్రారంభం కాగా.. ఆ మూవీ నుంచి కొన్ని ఫోటోలు లీక్ కాగా వైరల్‌గా మారాయి. ఇప్పటికే గతంలో ఓసారి ఈ సినిమా నుంచి రామ్ చరణ్, అంజలి పిక్స్ లీక్ అవ్వగా.. లేటెస్ట్‌గా రామ్ చరణ్, కియరాల పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 23, 2023 | 04:40 PMLast Updated on: Aug 23, 2023 | 4:40 PM

Ram Charan And Kiara Advanis Game Changer Movies Sizzling Song Shoot Leaked Online

Game Changer: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత చెర్రీ అదే టెంపోలో అగ్ర దర్శకుడితో సినిమా చేస్తుండటంతో అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి. ఇక డైరెక్టర్ శంకర్ అంటేనే భారీతనానికి పెట్టింది పేరు. సినిమా చిన్నదైనా, పెద్దదైనా రిచ్‌గానే తీయాలని తపిస్తుంటాడు. ముఖ్యంగా టెక్నికల్‌గా ఆయన చేసే ప్రయోగాలు అద్భుతం అనిపిస్తాయి. కొన్ని నెలలుగా సైలెంట్ మోడ్‌లో ఉన్న గేమ్ చేంజర్ ఇప్పుడు యాక్షన్‌లోకి దిగాడు.

అయితే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. గేమ్ ఛేంజర్ మూవీ వాస్తవానికి ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ కావాల్సింది. కానీ కొన్ని కారణాలను వల్ల వాయిదా పడింది. అయితే రీసెంట్‌గా కొత్త షెడ్యూల్ ప్రారంభం కాగా.. ఆ మూవీ నుంచి కొన్ని ఫోటోలు లీక్ కాగా వైరల్‌గా మారాయి. ఇప్పటికే గతంలో ఓసారి ఈ సినిమా నుంచి రామ్ చరణ్, అంజలి పిక్స్ లీక్ అవ్వగా.. లేటెస్ట్‌గా రామ్ చరణ్, కియరాల పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాక వైజాగ్‌లో షూటింగ్ జరుగుతున్న టైంలో రామ్ చరణ్ లుక్స్ కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు కూడా కొన్ని ఫొటోలు లీక్ కావడంతో మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజెంట్ హైదరాబాద్‌లో గేమ్ ఛేంజర్ షూటింగ్ జరుగుతోంది.

కియారా, రామ్ చరణ్‌పై ఓ అదిరిపోయే పాటను షూట్ చేస్తున్నారు. అయితే సాంగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. ఈ లీకైన పిక్స్‌లో రామ్ చరణ్ లుక్ వావ్ అనిపిస్తోంది. తెల్లటి దుస్తులపై నల్ల కోటు వేసుకున్నాడు చెర్రీ. లీక్ బెడదలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ ఫోటోలు బయటకు రావడంతో మేకర్స్ టెన్షన్ పడుతున్నారు.