RAM CHARAN-PRABHAS: మార్చ్‌లో మతిపోగొట్టే ప్లానింగ్‌తో చరణ్, ప్రభాస్ ఎటాక్

కల్కి 2898 ఏడీ మూవీ షూటింగ్ మార్చ్ 15లోగా పూర్తవ్వబోతోంది. ఆల్రెడీ పాట షూటింగ్‌ని పూర్తి చేసే పనిలో ఉంది ఫిల్మ్ టీం. ఇక ప్యాచ్ వర్క్ పెండింగ్ సీన్ షూటింగ్‌ని మార్చ్ 15 లోగా పూర్తి చేసి పేకప్ చెప్పబోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2024 | 06:33 PMLast Updated on: Feb 24, 2024 | 6:33 PM

Ram Charan And Prabhas Movie Teasers Will Release In March

RAM CHARAN-PRABHAS: మార్చిలో మేకప్ తర్వాత పేకప్ అంటున్నారు రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇద్దరి తాజా సినిమాలు మార్చిలోనేపూర్తి కాబోతున్నాయి. 22 భాషల్లో రిలీజ్ చేయబోతున్న కల్కి 2898 ఏడీ మూవీ షూటింగ్ మార్చ్ 15లోగా పూర్తవ్వబోతోంది. ఆల్రెడీ పాట షూటింగ్‌ని పూర్తి చేసే పనిలో ఉంది ఫిల్మ్ టీం. ఇక ప్యాచ్ వర్క్ పెండింగ్ సీన్ షూటింగ్‌ని మార్చ్ 15 లోగా పూర్తి చేసి పేకప్ చెప్పబోతున్నారు.

kalki 2898 AD: 22 భాషల్లో.. ఒకే ఒక్క పాటకి రెబల్ చిందులు..?

మార్చ్ మూడో వారం టీజర్‌ని రిలీజ్ చేయబోతున్న సినిమా టీం.. అలా ప్రమోషన్‌ని షురూ చేయబోతోంది. మే 9న రాబోయే సినిమాకోసం పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తోంది. మార్చ్ థర్ట్ వీక్ కల్కి 2898 ఏడీ మూవీ టీజర్ రాబోతుంటే, మార్చ్ 27న గేమ్ ఛేంజర్ టీజర్ రానుంది. అంతేకాదు ఇది కూడా మార్చ్ 22 కల్లా పూర్తి కాబోతోంది. శంకర్ చివరి షెడ్యూల్‌ని వచ్చే నెల 2 వారాలు ప్లాన్ చేశాడు. ఇక చరణ్ బర్త్ డే స్పెషల్‌గా గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ మార్చ్ 27న రాబోతోంది. ఇలా ఒకే నెలలో ఆల్‌మోస్ట్ ఒకే వారంలో అటు రెబల్ స్టార్ సినిమా తాలూకు టీజర్, ఇటు మెగా పవర్ స్టార్ మూవీ తాలూకు టీజర్ రావటం కన్ఫామ్ అయ్యింది.

అయితే పుష్ప టీం మాత్రం ఏదో సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. అది పాటా, లేదంటే మేకింగ్ వీడియోనా అనేది మాత్రం ఇంకా తేలలేదు. మొత్తానికి మార్చ్ మూడో వారం రెండు సర్‌ప్రైజులు కన్ఫామ్ అయితే, మూడో సర్‌ప్రైజ్ కూడా ఉండేలా ఉందని తెలుస్తోంది.