RAM CHARAN: చరణ్‌తో బ్రహ్మాండం బద్దలు కొట్టబోతున్న సుకుమార్
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దేవర వరకు చాలా కాంబినేషన్లు రిపీట్ అవుతున్నాయి. కాని ఏ కాంబినేషన్‌కి లేని క్రేజ్.. రామ్ చరణ్, సుకుమార్ కాంబోకే ఉంది. ఈ కాంబినేషన్ రిపీట్ అయితే ఏదో జరిగిపోతుందనేంతగా అంచనాల భారం పెరుగుతోంది.
RAM CHARAN: రామ్ చరణ్‌తో సుకుమార్ మూవీ ఈనెల 27న ఎనౌన్స్ చేస్తారనే అంచనాలున్నాయి. ఆల్రెడీ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్ సినిమా లాంచైంది. ఆ తర్వాతే సుకుమార్‌తో చరణ్ చేసే మూవీ పట్టాలెక్కబోతోంది. గతంలో రంగస్థలంతో రామ్ చరణ్, సుకుమార్ హిట్ కాంబినేషన్ అని తేలింది. సో.. ఈ కాంబోరిపీట్ అయితే భూమ్ బద్దలే. మామూలుగా హిట్ కాంబినేషన్లు రిపీట్ అవటం కామన్. అలా పవన్‌తో హరీష్ శంకర్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది.
Apple: యాపిల్‌పై అమెరికా కేసు.. 9 లక్షల కోట్ల నష్టం..
కొరటాల శివతో రెండో సారి ఎన్టీఆర్ మూవీ తెరకెక్కుతోంది. ఇలా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దేవర వరకు చాలా కాంబినేషన్లు రిపీట్ అవుతున్నాయి. కాని ఏ కాంబినేషన్‌కి లేని క్రేజ్.. రామ్ చరణ్, సుకుమార్ కాంబోకే ఉంది. ఈ కాంబినేషన్ రిపీట్ అయితే ఏదో జరిగిపోతుందనేంతగా అంచనాల భారం పెరుగుతోంది. దానిక్కారణం త్రిబుల్ ఆర్‌తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా మారాడు. పుష్పతో పాన్ ఇండియాని సుకుమార్ షేక్ చేశాడు. అలాంటి ఈ ఇద్దరు పాన్ ఇండియా ట్రెండ్ సెట్టర్లు కలిస్తే సినీ సునామే అనుకోవటంలో అశ్చర్యంలేదు. అచ్చంగా ఇలానే పాన్ ఇండియా సూపర్ హీరో ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ కాంబినేషన్ రిపీట్ అనగానే వైబ్రేషన్స్ మారిపోతున్నాయి. ఇద్దరూ పాన్ ఇండియా మార్కెట్‌ని ఊపేసిన బ్యాచే. అలాగే సలార్‌తో ఈ కాంబినేషన్ ఆల్రెడీ 700 కోట్లకు పైనే వసూళ్ల వరద తెచ్చింది. కాబట్టే సలార్ 2తో కాంబినేషన్ రిపీట్ అనగానే అంచనాల భారం పెరుగుతోంది.
ఇక అర్జున్ రెడ్డితో పాన్ ఇండియా లెవల్లో భాషలకు అతీతంగా విజయ్‌కి పేరొచ్చింది. గీత గోవిందం ఓటీటీలో చాలా భాషల్లో జనాలకు రీచ్ అవటంతో పరశురామ్ మేకింగ్ మీద గురి కుదిరింది. అందుకే ఈ కాంబినేషన్ రిపీట్ అవటంతో ఫ్యామిలీ స్టార్ పాన్ ఇండియాలెవల్లో క్రేజీ ప్రాజెక్ట్‌గా మారుతోంది. ఇలా ప్రభాస్-ప్రశాంత్ నీల్, సుకుమార్-చరణ్, పరశురామ్-విజయ్ కాంబినేషన్ రిపీట్ అవటం మాత్రం పాన్ ఇండియా మార్కెట్‌ని షేక్ చేసేలా ఉంది.