Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి రండి.. రాంచరణ్‌కు ఆహ్వానం..
అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసనకు ఆహ్వానం అందింది. ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేద్కర్.. హైదరాబాద్‌లోని రాంచరణ్ నివాసానికి వెళ్లి.. ఆహ్వాన పత్రిక అందించారు.
Ayodhya Ram Mandir: రాంచరణ్.. ట్రిపులార్‌తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. చెర్రీ పాత సినిమాలు ఇప్పుడు హిందీలోకి డబ్ అయి.. హిట్ కొడుతున్నాయ్ అంటే అర్థం చేసుకోవచ్చు మనోడి క్రేజ్. జంజీర్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయినా.. ట్రిపులార్‌తో తన సత్తా చాటాడు రాంచరణ్. తర్వాత రాబోయే సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీసే కావడంతో.. బాలీవుడ్ జనాలు చరణ్ మూవీస్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసనకు ఆహ్వానం అందింది.
Janasena Target : జనసేన టార్గెట్ టెన్ వీళ్లే ! ఓడించి తీరాలని కసితో ఉన్నారు !!
ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేద్కర్.. హైదరాబాద్‌లోని రాంచరణ్ నివాసానికి వెళ్లి.. ఆహ్వాన పత్రిక అందించారు. ఈ వేడుకకు ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, సాధువులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయ్. ఆహ్వానాలను అందుకున్న సెలబ్రిటీలలో రజనీకాంత్, అజయ్ దేవగణ్, కంగనా రనౌత్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, అలియా భట్, రణదీప్ హుడా, రణబీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, ధనుష్ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 8వేల మంది ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయ్. ఈ నెల 22న మందిరంలోని రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. లక్షకు పైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
రామాలయం కాంప్లెక్స్‌ను 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఆలయంలోని ప్రతి ఫ్లోర్ 20 అడుగుల ఎత్తు ఉంటుంది. 44 ద్వారాలు, 392 పిల్లర్లతో ఆలయం నిర్మించారు. చిరు అండ్ ఫ్యామిలీ.. హనుమంతుడికి వీరభక్తులు.. ఇప్పుడు రాంచరణ్‌కు అయోధ్య నుంచి ఆహ్వానం రావడంతో.. రామయ్య సన్నిధిలో చిరంజీవి కొడుకు అంటూ.. ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఆ ఫొటోలను షేర్ చేస్తున్నారు.