Ram Charan: మెగా ప్రిన్సెస్ వచ్చేసింది.. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఆడబిడ్డ..
మంగళవారం వేకువఝామున ఉపాసన పాపకు జన్మనిచ్చినట్లు, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రివర్గాలు ప్రకటించాయి. దీంతో చిరంజీవి కుటుంబంతోపాటు ఉపాసన కామినేని కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. ఉపాసన డెలివరీ సమయంలో ఆమె తల్లి, కుటుంబ సభ్యులతోపాటు రామ్ చరణ్, చిరంజీవి దంపతులు ఆస్పత్రిలోనే ఉన్నారు.

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. మంగళవారం వేకువఝామున ఉపాసన పాపకు జన్మనిచ్చినట్లు, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రివర్గాలు ప్రకటించాయి. దీంతో చిరంజీవి కుటుంబంతోపాటు ఉపాసన కామినేని కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి.
ఉపాసన డెలివరీ సమయంలో ఆమె తల్లి, కుటుంబ సభ్యులతోపాటు రామ్ చరణ్, చిరంజీవి దంపతులు ఆస్పత్రిలోనే ఉన్నారు. చరణ్, రామ్ చరణ్‌కు పాప జన్మించడంతో మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా చరణ్-ఉపాసన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోసారి తాత అయినందుకు మెగాస్టార్ చిరంజీవికి కూడా ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. సినిమా, రాజకీయ ప్రముఖులు కూడా తమ శుభాకాంక్షలు చెబుతున్నారు. తనకు పాప పుట్టడంతో చరణ్ కొంతకాలం షూటింగ్‌కు దూరంగా ఉండనున్నారు. ఈ సమయంలో ఉపాసనకు తోడుగా ఉండాలని, ఆగష్టు వరకు షూటింగులకు వెళ్లకూడదని ఆయన నిర్ణయించుకున్నారు.
కాగా, ఇప్పటివరకు వేరే చోట ఉన్న చరణ్-ఉపాసన దంపతులు ఇకపై చిరంజీవి ఇంటికి మారబోతున్నట్లు ప్రకటించారు. తమ ఎదుగుదలలో గ్రాండ్ పేరెంట్స్ ఎంతో కీలక పాత్ర పోషించారని, గ్రాండ్ పేరెంట్స్‌తో ఉండటం వల్ల వచ్చే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదని, అందువల్ల చిరంజీవి ఇంటిలోనే ఉండాలనుకుంటున్నట్లు ఉపాసన తెలిపారు. రామ్ చరణ్-ఉపాసన 2012 జూన్‌లో వివాహం చేసుకున్నారు. ఇటీవలే ఈ జంట తమ 11వ వివాహ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంది.