ఎన్టీఆర్ ఒక్కడే కాదు.. జపాన్ లో రామ్ చరణ్ ఫాలోయింగ్ కూడా మామూలుగా లేదు.. ఇదే సాక్ష్యం..!
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని అభిమానులు అతనికి బర్త్ డే విషెస్ తెలిపారు. మరోవైపు తన పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదలయ్యాయి.

మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని అభిమానులు అతనికి బర్త్ డే విషెస్ తెలిపారు. మరోవైపు తన పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. వీటిలో చరణ్ రఫ్ లుక్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. రంగస్థలమే అనుకుంటే దాన్ని మించి ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. ఇప్పటి వరకు చరణ్ కెరీర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా చిట్టిబాబు టాప్ లో ఉన్నాడు. బుచ్చిబాబు పెద్ది పోస్టర్ చూసిన తర్వాత చిట్టి బాబుని కూడా డామినేట్ చేసేలా కనిపిస్తుంది ఈ క్యారెక్టర్. ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి. మరోసారి తనలోని నటుడికి చరణ్ పని చెబుతున్నాడని అర్థమవుతుంది. ఇదిలా ఉంటే కేవలం ఇండియాలోనే కాదు ఓవర్సీస్ నుంచి కూడా చరణ్ కు బర్త్ డే విషెస్ వచ్చాయి. అమెరికా, లండన్ లాంటి దేశాలలో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు జరిగితే పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి. కానీ జపాన్ లో కూడా చరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.
అక్కడ అభిమానులు గ్లోబల్ స్టార్ పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరుతో ఉన్న చీరలు కట్టుకున్నారు. టీం రామ్ చరణ్ ఫ్రమ్ జపాన్ అంటూ అక్కడి నుంచి తమ లవ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటన్నింటినీ చూసి రామ్ చరణ్ కూడా ఎంతో సంతోషపడ్డాడు. ఇప్పటివరకు జపాన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ముందు గుర్తుకొచ్చేవాడు. కానీ త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కు ఎంత ఫాలోయింగ్ వచ్చిందో.. అంటే ఇమేజ్ చరణ్ కు కూడా వచ్చింది. అందుకే ఆయన పుట్టిన రోజు నాడు జపనీయులు అంతగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇకమీద చరణ్ సినిమాలను జపాన్ లో కూడా విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే అప్పట్లో రంగస్థలం సినిమాను అక్కడ విడుదల చేశారు. నెక్స్ట్ రాబోయే పెద్ది సినిమా కూడా జపాన్ రిలీజ్ కానుంది. దాని తర్వాత సుకుమార్ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. జపాన్ లో తనకు ఏర్పడిన ఫ్యాన్ బేస్ మరింత పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్.
ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కాస్త ముందు ఉన్నాడు. దేవర సినిమా ప్రమోషన్ కోసం ప్రస్తుతం జపాన్లోనే ఉన్నాడు ఈయన. అక్కడ అభిమానులతో కలుస్తూ వాళ్లతో ఎక్కువగా మింగిల్ అవుతూ జపనీయులకు మరింత చేరువయ్యాడు తారక్. రామ్ చరణ్ కూడా త్వరలోనే జపాన్ టూర్ వెయ్యాలని చూస్తున్నాడు. అక్కడ అభిమానులతో కలిసి కొన్ని రోజులు స్పెండ్ చేసే ప్లాన్ కూడా చేస్తున్నాడు. తనకు వచ్చిన మార్కెట్ ను అనవసరంగా వదిలిపెట్టకూడదని కసి మీద ఉన్నాడు చరణ్. అందుకే వీలు చూసుకుని ఒకసారి జపాన్ టూర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఆయన పుట్టినరోజు వేడుకలు జపాన్ లో కూడా జరగడంతో.. అక్కడ కూడా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉందనే విషయం అర్థం అవుతుంది. మొత్తానికి మన హీరోలు ఇండియాలో మాత్రమే కాదు జపాన్ లో కూడా జెండా పాతేస్తున్నారు.