మెగాస్టార్ హీరోయిన్ తో గ్లోబల్ స్టార్ డాన్స్ లు, బుచ్చి ప్లానింగ్ వేరే లెవెల్

మన టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ హవా కాస్త ఎక్కువగా నడిచే సిగ్నల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరోల సినిమాల్లో ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు తమిళంకు మాత్రమే పరిమితమైన ఈ స్పెషల్ సాంగ్స్ హవా ఇప్పుడు మన తెలుగులో కూడా అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 11, 2024 | 04:49 PMLast Updated on: Dec 11, 2024 | 4:49 PM

Ram Charan Dance With Megastar Heroin

మన టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ హవా కాస్త ఎక్కువగా నడిచే సిగ్నల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరోల సినిమాల్లో ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు తమిళంకు మాత్రమే పరిమితమైన ఈ స్పెషల్ సాంగ్స్ హవా ఇప్పుడు మన తెలుగులో కూడా అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. రీసెంట్ గా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ఐటం సాంగ్స్ బదులు స్పెషల్ సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్లు. ఇప్పుడు బుచ్చిబాబు రామ్ చరణ్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కంటే కూడా స్పెషల్ సాంగ్ నను ప్లాన్ చేయాలని డైరెక్ట్ బుచ్చిబాబు భావిస్తున్నాడట.

ఈ సినిమా షూటింగ్ ను చాలా స్పీడ్ గా కంప్లీట్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా కారణంగా దాదాపు రామ్ చరణ్ మూడేళ్లపాటు మరో సినిమా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఆ గ్యాప్ ను కవర్ చేయడానికి బుచ్చిబాబు సినిమాను వేగంగా కంప్లీట్ చేసి ఆ తర్వాత సుకుమార్ సినిమా మొదలు పెట్టాలని రెడీ అవుతున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే మైసూర్లో జరుగుతుంది. అక్కడే మరో వారం పాటు జరిగే అవకాశం ఉంది. హీరోయిన్ జాన్వీ కపూర్ తో కలిసి షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు బుచ్చిబాబు.

ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఒక కీలక పాత్రలో కనపడనున్నాడు. వీరి ముగ్గురి మధ్య సీన్స్ ను ఇక్కడ షూట్ చేస్తున్నారట. అలాగే విలన్ గా కచ్చితంగా ఈ సినిమాలో ట్విస్ట్ ఉండే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒక టాలీవుడ్ హీరోను విలన్ గా తీసుకుంటున్నారని టాక్ నడుస్తుంది. దీనికి సంబంధించి ఓ మాజీ స్టార్ హీరోయిన్ ను ఫైనల్ చేసినట్టుగా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. చిరంజీవి తో ఠాగూర్ సినిమాలో నటించిన శ్రేయ తో రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో డాన్స్ చేయనున్నాడు.

దీనికి సంబంధించి ఇప్పటికి ఒక పాట కూడా రెడీ చేసినట్టు టాక్. ఆ సాంగ్ ను వేగంగా రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ పైనే ఇప్పుడు ఫోకస్ అంతా. రజినీకాంత్ వెట్టాయం సినిమాలో వచ్చిన స్పెషల్ సాంగ్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఇప్పుడు తెలుగులో కూడా ఆ ట్రెండ్ తీసుకువచ్చేందుకు డైరెక్టర్లు పోటీపడుతున్నారు. ఈ సినిమాను 2026 సంక్రాంతికి లేదంటే 2025 చివర్లో రిలీజ్ చేయడానికి రామ్ చరణ్ పట్టుదలగా ఉన్నాడు. సుకుమార్ సినిమాను కూడా వచ్చేయడాది వేసవిలో మొదలుపెట్టే ఛాన్స్ ఉంది.