RAM CHARAN: రాంచరణ్‌ కూతురి ఫేస్ రివీల్‌.. క్లీంకారా ఎంత ముద్దుగా ఉందో..!

క్లీంకారా ఫేస్‌ రివీల్ అవుతున్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా హీరో వరుణ్ తేజ్​, నటి లావణ్య త్రిపాఠిల పెళ్లికి మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలను రాంచరరణ్, ఉపాసన తమ ఇన్‌స్టాలో పంచుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 29, 2023 | 04:57 PMLast Updated on: Oct 29, 2023 | 4:57 PM

Ram Charan Daughter Klinkaara Face Revealed In A Photo

RAM CHARAN: క్లీంకారా.. మెగాస్టార్ అభిమానులను వెంటాడే ఓ ఎమోషన్ ఇది. రాంచరణ్, ఉపాసనల కూతురు అయినా.. క్లీంకారాను తమ ఇంటి బిడ్డ అనుకోవడం స్టార్ట్ చేశారు మెగా ఫ్యాన్స్ అంతా ! ఐతే ఇంతవరకు క్లీంకారాను చూపించలేదు మెగా ఫ్యామిలీ. బారసాల టైమ్‌లోనూ.. తర్వాత ఫ్యామిలీ ఫొటోల్లోనూ.. నిన్నటికి నిన్న బతుకమ్మ ఆడినప్పుడు కూడా క్లీంకారా ఫేస్‌ రివీల్‌ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మెగా కుటుంబసభ్యులు.

ఐతే క్లీంకారా ఎలా ఉంది.. అమ్మ పోలికా.. నాన్న పోలికా.. అని ఆమెను చూసేందుకు వెయిట్‌ చేసిన అభిమానులకు హ్యాపీ ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో కనిపించింది. క్లీంకారా ఫేస్‌ రివీల్ అవుతున్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా హీరో వరుణ్ తేజ్​, నటి లావణ్య త్రిపాఠిల పెళ్లికి మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలను రాంచరరణ్, ఉపాసన తమ ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇరు కుటుంబాల సభ్యులు కలిసి ఒకే ఫోటోలో కనిపించారు. కొణిదెల, కామినేని ఫ్యామిలీ ఇన్‌ వన్‌ ఫ్రేమ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయ్. ఈ ఫోటోలో మెగా మనవరాలు క్లీంకార వైపే నెటిజన్స్ ఆసక్తి చూపారు. స్విమ్మింగ్ పూల్ ముందు వీళ్లంతా కలిసి ఫొటో దిగారు. అందులో క్లీంకారా కూడా ఉంది. కానీ, ఆమె ఫేస్‌పై ఒక లవ్ సింబల్‌తో కవర్ చేశారు. అయినా, క్లీంకారా ఫేస్ కనిపిస్తోంది. ఎలాగంటారా.. నీటిలో పాప ప్రతిబింబం కనిపిస్తోంది. ఫొటోలో కనిపించకుండా కవర్ చేశారు. కానీ, నీళ్లలో ప్రతిబింబంలో మాత్రం అలాగే ఉంచేశారు.

దీంతో ఇది చూసిన నెటిజన్స్.. ఉపాసన మేడమ్.. మీరు క్లీంకార ఫేస్‌ను నీటిలో కవర్ చేయడం మరిచిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ క్లీంకారను చూసినంత ఆనందంలో మునిగిపోయారు. ఇక అటు మరో రెండు రోజుల్లో వరుణ్‌తేజ్‌, లావణ్య జంట.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతోంది. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. నవంబర్ 1న ఏడు అడుగులు వేయబోతుంది. తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్‌చరణ్‌, ఉపాసన ఇటలీ చేరుకుని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు.