Biopic: విరాట్ కోహ్లీ బయోపిక్‌లో చెర్రీ!? పోలికలు కూడా కలిసిపోయాయిగా..
స్టార్స్ జీవితాల ఆధారంగా బయోపిక్‌లు నిర్మించడం కొత్తేమీ కాదు. కేవలం సినిమా స్టార్సే కాదు. చాలా మంది స్పోర్ట్స్ స్టార్ల జీవితాలు కూడా బయోపిక్‌లుగా వచ్చాయి. ఎంఎస్ ధోనీ, మిల్కాసింగ్, సచిన్ టెండుల్కర్ లాంటి స్టార్ ప్లేయర్స్ జీవితాధారంగా వచ్చిన చాలా సినిమాలు సూపర్‌హిట్ విజయాన్ని సాధించాయి.
ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ బయోపిక్ కూడా త్వరలోనే రానుంది అనే గుసగుసలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఇదే విషయంలో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్‌గా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తించాయి. క్రికెట్ పరంగా విరాట్ కొహ్లీకి ఎంత క్రేజ్ ఉందో.. ట్రిపులార్ సినిమాతో అంతే క్రేజ్ సంపాదించాడు రామ్ చరణ్. అటు పేరుకు క్రికెటర్ అయినా.. విరాట్ కోహ్లీకి కూడా సినిమా హీరోలకు ఏమాత్రం తగ్గని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.
రీసెంట్‌గా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. విరాట్ కోహ్లీ బయోపిక్ తీస్తే సూపర్ హిట్ అవుతుందంటూ తన ఒపీనియన్ చెప్పాడు. విరాట్ జీవితంలో ఓ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నాడు చెర్రీ. కెరియర్‌లో స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన ప్రస్థానం. తన మ్యాచ్ జరుగుతుండగానే తన తండ్రి చనిపోవడం. అతి తక్కువ సమయంలోనే టీమిండియా కెప్టెన్‌గా ఎదగడం, ప్రపంచంలోనే నెంబర్ వన్ క్రికెటర్‌గా పేరు తెచ్చుకోవడం ఇవన్నీ సినిమాలో ఎలివేట్ చేసేందుకు చాలా అద్భుతంగా ఉంటాయంటూ చెప్పాడు.
అనుష్క శర్మతో ప్రేమ పెళ్లి కూడా రొమాంటిక్ యాంగిల్‌ను ఎలివేట్ చేసేందుకు అద్భుతమైన ఎలిమెంట్ అంటూ చెప్పాడు. ఎవరైనా డైరెక్టర్ ఈ స్టోరీ చేసేందుకు ముందుకు వస్తే తానే హీరోగా నటించేందుకు రెడీగా ఉన్నానంటూ చెప్పాడు. ట్రిపులార్ తరువాత రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు చరణ్ తీసే సినిమా ఏదైనా గ్లోబల్ లెవెల్‌కు ఈజీగా రీచ్ అవుతుంది. దీంతో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చెర్రీతో కలిసి పని చేసేందుకు ఎనీ టైం రెడీగా ఉంటారు. అయితే చరణ్ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌తో కోహ్లీ బయోపిక్ తీసేందుకు ఎవరైనా ముందుకు వస్తారా చూడాలి. ఒకవేళ వస్తే మాత్రం కోహ్లీ గేమ్‌ను చెర్రీలో చూస్తారు ఇద్దరు ఫ్యాన్స్.