RAM CHARAN: ఇంతవరకు చేయని పాత్రలో చరణ్.. తగ్గేదేలే..
ధృవలో పోలిస్‌గా, ఆచార్యలో నక్సల్‌గా కనిపించిన చరణ్ ఇంతవరకు వేయని పాత్ర స్పై. అదే ఇప్పుడు వేయబోతున్నాడు. సుకుమార్ డైరెక్షన్‌లో చరణ్ చేయబోయే మూవీ 1930లో.. అంటే స్వాతంత్య్రానికి ముందు కాలానికి సంబంధించిందని తెలుస్తోంది.

RAM CHARAN: రామ్ చరణ్ చిరు తనయుడిగా వచ్చాడు. చిరుతగా గర్జించాడు. అందరికి తెలిసిందే. మగధీరగా కత్తి తిప్పితే ఆ టైంలో ఇండస్ట్రీ రికార్డులు బద్దలయ్యాయి. తర్వాత తనలో మరో కోణం కనిపించింది రంగస్థలంతోనే. ఆ మూవీ తీసిన సుకుమార్ మరోసారి మెగా పవర్ స్టార్‌తో మూవీ ప్లాన్ చేశాడు. ధృవలో పోలిస్‌గా, ఆచార్యలో నక్సల్‌గా కనిపించిన చరణ్ ఇంతవరకు వేయని పాత్ర స్పై. అదే ఇప్పుడు వేయబోతున్నాడు.
PUSHPA 2: పుష్ప రాజ్ చాప్టర్ క్లోజ్ చేసిన రామ్ చరణ్
సుకుమార్ డైరెక్షన్‌లో చరణ్ చేయబోయే మూవీ 1930లో.. అంటే స్వాతంత్య్రానికి ముందు కాలానికి సంబంధించిందని తెలుస్తోంది. ఇక మొదటిసారి గూఢచారిగా కనిపించబోతున్నాడు. అది కూడా బ్రిటీష్‌కి వ్యతిరేకంగా పనిచేసే స్పైగా కనిపించబోతున్నాడు చరణ్. మద్రాస్ నేపధ్యంతో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకుని ఈ మూవీ కథ రెడీ చేశాడట సుకుమార్. ఆమధ్య త్రిబుల్ ఆర్ ప్రమోషన్‌లో సుకుమార్ సినిమాలో చరణ్ ఎంట్రీ సీన్ ఎలా ఉంటోందో చెప్పిన వీడియో ఇప్పుడు మళ్లీ వైరలైంది.
ఓపెనింగ్ సీన్ లో హీరోని ఇండియన్స్, బ్రిటీషర్స్ ఇద్దరూ వేటాడుతుంటే, ఎవరినీ చంపకుండా తను చావకుండా చరణ్ ఎస్కేప్ అవుతూ ఇచ్చే ఎంట్రీ సీన్ మైండ్ బ్లోయింగ్ అని తెలుస్తోంది. ఇండస్ట్రీ సర్కిల్ లో వినిపిస్తున్న ఈ సీన్ గురించే అప్పుడు రాజమౌళి పరోక్షంగా చెప్పాడనంటున్నారు. ఆ మాటలే ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వెలుగులోకి వచ్చాయి.