RAM CHARAN: ఏడాదిలో 3 సినిమాలు.. ఫ్యాన్స్‌కి గ్లోబల్ ఆఫర్..
సమయాన్ని బ్యాలెన్స్ చేసేందుకు, ఒకే ఏడాది మూడు సినిమాల ఆఫర్ ఇస్తున్నాడు. 12 నెలల్లో తన మూడు సినిమాల రిలీజ్‌లు పెట్టుకున్నాడు. శంకర్ మేకింగ్‌లో గ్లోబల్ స్టార్ చేస్తున్న గేమ్ ఛేంజర్ ఆగష్టు లేదా సెప్టెంబర్‌లో వచ్చే చాన్స్ ఉంది.
RAM CHARAN: 2022 మార్చ్‌లో త్రిబుల్ ఆర్ వచ్చింది. అంటే రెండేళ్లవుతోంది. ఇక త్రిబుల్ ఆర్ వచ్చిన నెలకే వచ్చిన ఆచార్య సందడి చేసి కూడా ఆల్‌మోస్ట్ రెండేళ్లవుతోంది. కానీ ఈ రెండేళ్లలో చరణ్ సినిమా ఏదీ రాలేదు. శంకర్‌ని నమ్ముకుంటే గేమ్ ఛేంజర్ మూవీ రెండేళ్లుగా సెట్స్‌లోనే నలిగింది. భారతీయుడు 2, భారతీయుడు 3తో పాటు గేమ్ ఛేంజర్‌ని తెరకెక్కించటమే ఈ ఆలస్యానికి కారణం.
The Goat Life: ది గోట్‌లైఫ్.. ఆడు జీవితం.. ఎలా ఉంది..? మినీ రివ్యూ..
ఇలా చాలా టైంని కోల్పోయిన చరణ్.. ఇప్పుడు ఆ సమయాన్ని బ్యాలెన్స్ చేసేందుకు, ఒకే ఏడాది మూడు సినిమాల ఆఫర్ ఇస్తున్నాడు. 12 నెలల్లో తన మూడు సినిమాల రిలీజ్‌లు పెట్టుకున్నాడు. శంకర్ మేకింగ్‌లో గ్లోబల్ స్టార్ చేస్తున్న గేమ్ ఛేంజర్ ఆగష్టు లేదా సెప్టెంబర్‌లో వచ్చే చాన్స్ ఉంది. అది మిస్ అయితే దీపావళికి విడుదల కావొచ్చు. ఆ తర్వాత 2025లో బుచ్చి బాబు మూవీ దసరాకు వస్తుందట. డిసెంబర్‌లో సుకుమార్‌తో చరణ్ చేసే సినిమా వచ్చే ఛాన్స్ ఉందట.
అంటే సరిగ్గా ఈ ఏడాది దీపావళి నుంచి 2025 క్రిస్మస్ వరకు మొత్తంగా 11 నుంచి 12 నెలల గ్యాప్‌లో చరణ్ మూడు సినిమాలు రాబోతున్నాయి. అకడమిక్ ఇయర్ ప్రకారం కాకున్నా, 12 నెలల గ్యాప్‌లో మూడు సినిమాలతో మూడు సీజన్లు మెగా కిక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు చరణ్.