Ram Charan: మెగా.. భారతీయుడు.. కమల్ సినిమాలో చరణ్..
భారతీయుడు 2 కూడా తీసేది శంకరే అవటం.. అది పూర్తికావొస్తుండటంతో ప్రీ క్లైమాక్స్‌లో చరణ్‌ని కామియో రోల్ చేయమని అడిగాడట శంకర్. ఇది మాత్రం నిజమే.. అయితే సూచన ప్రాయంగా చరణ్ కూడా ఒప్పుకున్నాడని తెలుస్తోంది. చిరునే కమల్‌ని పాథ్ ఫైండర్‌గా భావిస్తాడు.

Will Ram Charan's game changer be like Kamal Haasan's Bharatiyadu 2
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లియోలో గెస్ట్ రోల్ వేస్తున్నాడంటే, మెగా టీం వెంటనే స్పందించి అవన్నీ రూమర్స్ అని తేల్చింది. కట్ చేస్తే వారం గ్యాప్ లో ఇప్పుడు మరో తమిళ్ మూవీ భారతీయుడు 2లో చరణ్ గెస్ట్ రోల్ అంటున్నారు. రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ మూవీ తీస్తున్న శంకరే భారతీయుడు 2 తీస్తుండటంతో ఈ కొత్త ప్రచారం మెగా ఫ్యాన్స్‌ని కన్ ఫ్యూజన్‌లోకి నెట్టట్లేదు. కిక్ ఇస్తోందంటున్నారు. ప్రజెంట్ చరణ్.. శంకర్ మేకింగ్‌లో గేమ్ ఛేంజర్ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
ఐతే భారతీయుడు 2 కూడా తీసేది శంకరే అవటం.. అది పూర్తికావొస్తుండటంతో ప్రీ క్లైమాక్స్‌లో చరణ్‌ని కామియో రోల్ చేయమని అడిగాడట శంకర్. ఇది మాత్రం నిజమే.. అయితే సూచన ప్రాయంగా చరణ్ కూడా ఒప్పుకున్నాడని తెలుస్తోంది. చిరునే కమల్‌ని పాథ్ ఫైండర్‌గా భావిస్తాడు. అలాంటి లోకనాయకుడితో స్క్రీన్ షేర్ చేసుకోవటానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నాడట చరణ్. ఐతే ప్రీ క్లైమాక్స్ తాలూకు సీన్లు మాత్రం గేమ్ ఛేంజర్ పూర్తయ్యాకే ప్లాన్ చేస్తారట. ఎందుకంటే గేమ్ ఛేంజర్ కంటే ముందే భారతీయుడు 2 మూవీ విడుదలౌతుంది.
సో.. గేమ్ ఛేంజర్‌లో చరణ్ తాలూకు లుక్‌లోని ట్విస్ట్‌లని ఈ సినిమా రివీల్ చేస్తుంది. అందుకే గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తయ్యాక, కొత్త లుక్‌లో చరణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తాడట. భారతీయుడు 2 ప్రి క్లైమాక్స్ సీన్‌లో కామియో అప్పియరెన్స్ ఇస్తాడట.