500 కోట్ల గేమ్ తుస్సయ్యాయ… 500 కోట్ల మరో మిస్టేక్…
రామ్ చరణ్ మొన్నటికి మొన్నే 500 కోట్ల డిజాస్టర్ ని ఫేస్ చేశాడు. గేమ్ ఛేంజర్ తో కోలుకోలేని దెబ్బ పడింది. ఇక నిర్మాత దిల్ రాజు అయితే, కక్కలేక మింగలేక తికమకపడ్డాడు. ఏదో లక్కీగా సంక్రాంతికి వస్తున్నాం హిట్ అవటంతో గట్టెక్కాడు.

రామ్ చరణ్ మొన్నటికి మొన్నే 500 కోట్ల డిజాస్టర్ ని ఫేస్ చేశాడు. గేమ్ ఛేంజర్ తో కోలుకోలేని దెబ్బ పడింది. ఇక నిర్మాత దిల్ రాజు అయితే, కక్కలేక మింగలేక తికమకపడ్డాడు. ఏదో లక్కీగా సంక్రాంతికి వస్తున్నాం హిట్ అవటంతో గట్టెక్కాడు. లేదంటే ఆల్ మోస్ట్ రోడ్డుమీదకొచ్చే పరిస్తితి… అంతగా ఈ నిర్మాతని, డైరెక్టర్ శంకర్ నిండా ముంచేశాడు. చరణ్ కూడా చాలా ఘోరంగా సఫర్ అయ్యాడు. రెండున్నరేళ్ల కష్టానికి విలువే లేకుండా పోయింది. ఇంత జరీగాక ఎవరైనా మారాలి. చేసిన తప్పు చేయకుండా ఉండాలి. కాని టాప్ ప్రొడ్యూసరైన దిల్ రాజు మారినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే, మొన్నే 500 కోట్ల గాయం అయినా, మళ్లీ 500 కోట్ల రిస్క్ కి సిద్దపడ్డాడు. అది కూడా బాలీవుడ్ మార్కెట్ మీద మోజుతో… ఈ విషయం లో చరణ్ అడ్వైజ్ కూడా తనకి పనికొచ్చినట్టులేదు..
దిల్ రాజు, రామ్ చరన్, కైరా అద్వాని, డైరెక్టర్ శంకర్ ఈ కాంబినేషన్ లో వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్. ఇదో సెన్సేషనల్ డిజాస్టర్ గా నిలిచింది. చరణ్, దిల్ రాజు కెరీర్ లో మాయని మచ్చగా మారింది. ఈ మొత్తం తప్పుకి దిల్ రాజు కట్టిన పెనాల్టి అక్షరాలా 500 కోట్లని తెలుస్తోంది. 250 కోట్ల బడ్జెట్ అంచనాలతో మొదలై, 500 కోట్ల వరకు బడ్జెట్ లిమిట్ దాటిన ఈ సినిమా, 100 కోట్లను కూడా తిరిగి రాబట్టలేకపోయిందిదీనికి తోడు 186 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయని దొంగలెక్కలతో పోస్టర్లు కూడా రిలీజ్ చేయాల్సి వచ్చిందన్నారు. ఆ విషయంలో మీడియా కూడా గట్టిగానే వేసుకుంది. ఫైనల్ గా నష్టాల్లో ఉన్న దిల్ రాజుని ఇంకా టార్గెట్ చేయొద్దనే, అంతా జాలి పడే పరిస్తితొచ్చింది. ఇంత ఘనకార్యం చేసింది ది గ్రేట్ లివింగ్ లెజెండ్ డైరెక్టర్ శంకర్.
తన పైత్యం వల్ల ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆల్ మోస్ట్ రోడ్డుమీదకొచ్చినంత పనైంది. కొన్న ఆస్తున్ని అమ్మేంతగా పరిస్థితి దిగజారింది. కాని ఇలాంటి టైంలో సంక్రాంతికి వస్తున్నాం అని వెంకీతో అనిల్ రావిపుడి తీసిన మూవీ నాలుగు సెంచరీలు కొట్టింది. వసూళ్లు, అన్ని రైట్స్ తో కలిపి ఈమూవీ ఆల్ మోస్ట్ 450 కోట్ల వరకు రాబట్టిందని సమాచారం అందుతోంది.సో మొత్తానికి చావు తప్పి కన్నలొట్టపోయిన పరిస్థితులు ఫేస్ చేసిన దిల్ రాజు, మళ్లీ వందలకోట్లతో ప్రయోగాలు చేయకూడదు. చేసినతప్పు రిపీట్ చేయకూడదు. కాని అదే తప్పు చేస్తున్నట్టున్నాడు. మొన్నటి వరకు కోలీవుడ్ లో నిర్మాతగా ఎలాగౌనా ప్రూవ్ చేసుకోవానే మోజు ఉండేది. అందుకే తమిళ స్టార్ విజయ్ తో వారసుడు తీసి చేతులు కాల్చుకున్నాడు.
తర్వాత శంకర్ తో సినిమా తీయాలిన కలలు కని, గేమ్ ఛేంజర్ తో సర్వం కాల్చుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు బాలీవుడ్ మీద మోజుతో తన తప్పుని రిపీట్ చేసేలా ఉన్నాడు. సంక్రాంతికి వస్తున్నాం ఇక్కడ హిట్ అయ్యిందని, దాన్నే హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నాడు. అనిల్ రావిపుడికి తన సినిమాని తానే రీమేక్ చేయటం ఇష్టం లేదు. కాబట్టే మరో డైరెక్టర్ ని కన్ఫామ్ చేశాకే, అక్షయ్ కుమార్ తో ఈ సినిమా సెట్స్ పైకెళుతుందట.అదేమంత రిస్క్ కాదు. కాని అక్షయ్ కుమార్ కి 150 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు మరాఠా మార్కెట్ లో 25 శాతం వాటా ఇవ్వాలి..అంటే300 కోట్లు అటే పోతాయి. మిగతా స్టార్ కాస్ట్, మేకింగ్ అన్నీ కలుపుకుంటే మరో సారి 400 కోట్ల నుంచి 450 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు రిస్క్ చేయాల్సి వచ్చేలా ఉంది. అతి కష్టం మీద బయట పడ్డ దిల్ రాజు మళ్లీ గేమ్ చేంజర్ లాంటి భారీ తప్పే చేస్తున్నాడనే కామెంట్ల దాడే పెరిగిపోయింది.