GAME CHANGER: దర్శకుడు శంకర్ మీద.. మెగా ఫ్యాన్స్ దాడి..

గేమ్ ఛేంజర్ తాలూకు ఏ అప్‌డేట్ లేకపోవటంతో శంకర్‌ని రెక్లెస్ డైరెక్టర్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. శంకర్ ఎంత టాప్ డైరెక్టర్ అయినా రెండేళ్ల క్రితం మొదలైన మూవీ టైటిల్ అప్‌డేట్ తప్ప మరే అప్‌డేట్ లేకపోవటంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2024 | 05:14 PMLast Updated on: Jan 31, 2024 | 5:14 PM

Ram Charan Fans Angry On Director Shankar About Game Changer Movie

GAME CHANGER: శంకర్ ఎప్పుడో ఏడాదిన్నర క్రితమే గేమ్ ఛేంజర్ మూవీ మొదలు పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్టు ఆమధ్య హడావిడి చేశారు. కాని రీషూట్లు, ప్యాచ్ వర్క్‌తోపాటు కథలో మార్పుల వల్ల ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది. మధ్యలో భారతీయుడు 2, భారతీయుడు 3 షూటింగ్ వల్ల గేమ్ ఛేంజర్‌కి బ్రేక్ పడింది. ఇలా బ్రేక్ పడితే పడింది కాని, ఇంతవరకు గేమ్ ఛేంజర్ తాలూకు ఏ అప్‌డేట్ లేకపోవటంతో శంకర్‌ని రెక్లెస్ డైరెక్టర్ అంటున్నారు మెగా ఫ్యాన్స్.

DIRECTOR SUJEETH: OG తర్వాత.. మహేశే టార్గెట్.. సుజిత్ ప్లాన్ ఇదే..!

శంకర్ ఎంత టాప్ డైరెక్టర్ అయినా రెండేళ్ల క్రితం మొదలైన మూవీ టైటిల్ అప్‌డేట్ తప్ప మరే అప్‌డేట్ లేకపోవటంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ డైరెక్టర్ అంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అదేంటో.. శంకర్ రోబో 2.0 నుంచి ఏం చేసినా బెడిసికొడుతుంది. తమిళనాడులో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, బాలీవుడ్‌లోకూడా ఈ దర్శకుడు అడుగేస్తే పంచ్ పడుతోంది. భారతీయుడు 2 మొదలయ్యాక, సెట్లో యాక్సిడెంట్లు, నిర్మాతతో బడ్జెట్ గొడవలు, కోర్టు గొడవలు జరిగాయి. గేమ్ ఛేంజర్ మొదలయ్యాక భారతీయుడు 2 పూర్తి చేయాలని కోర్టు ఆర్డర్ రావటం, అలా తన గేమే ఛేంజ్ అయ్యింది.

మధ్యలో అపరిచితుడు హిందీ రీమేక్ ప్లాన్ చేస్తే ఆ సినిమా నిర్మాత.. రీమేక్ రైట్స్ తన దగ్గరున్నాయంటూ శంకర్‌కి చుక్కలు చూపించాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ అప్‌డేట్స్ లేవంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాచూస్తే శంకర్ ఏం చేసినా, చేయకపోయినా వివాదాలు వెల్‌కమ్ చెబుతూనే ఉన్నాయనుకోవల్సి వస్తుంది.