Ram Charan: ఆకలితో ఫ్యాన్స్.. ఇదేం పరిస్థతి..?
ఆమధ్య గేమ్ చేంజర్ మోషన్ టీజర్ వదిలారు. తర్వాత ఇంతవరకు ఒక్కటంటే ఒక్క అప్‌డేట్ లేదు. కనీసం ఫస్ట్ లుక్కో, లేదంటే మరో పాత్ర మోషన్ పోస్టరో.. కాదంటే సాంగ్ లిరిక్సో.. ఇలా ఏదీ లేదు.

Ram Charan: మెగా ఫ్యాన్స్‌ని ఆకలి చంపేస్తోంది. దయనీయ స్థితిలో మెగా అభిమాలున్నారు. కారణం రామ్ చరణ్ కాదు. దిల్ రాజు కూడా కాదు. డైరెక్టర్ శంకరే. ఎప్పుడో మొదుల పెట్టిన గేమ్ ఛేంజర్ మూవీ ఇంతవరకు సీరియల్‌లా సాగుతూ వచ్చింది. సంక్రాంతికి వస్తుందా.. సమ్మర్ కి వస్తుందా.. అంటే కుదిరితే నెక్ట్స్ ఇయర్ దసరాకే విడుదల చేసేలా ఉంది ఫిల్మ్ టీం. ఆ సంగతి అటుంచితే ఇలాంటి ఓ సినిమా తెరకెక్కుతుందా? లేదా? అన్న డౌట్ వచ్చేలా అస్సలు అప్‌డేట్సే లేకుండా చేస్తున్నారు. ఆమధ్య గేమ్ చేంజర్ మోషన్ టీజర్ వదిలారు.
తర్వాత ఇంతవరకు ఒక్కటంటే ఒక్క అప్‌డేట్ లేదు. కనీసం ఫస్ట్ లుక్కో, లేదంటే మరో పాత్ర మోషన్ పోస్టరో.. కాదంటే సాంగ్ లిరిక్సో.. ఇలా ఏదీ లేదు. ఎలాగూ సంక్రాంతికి సినిమా రాదు. సమ్మర్‌లో వస్తుందో రాదో తేలలేదు. అందుకే అప్‌డేట్స్ రూపంలో కంటెంట్ వదిలితే, తర్వాత క్యూరియాసిటీ తగ్గుతుందని దిల్ రాజు టీం సైలెంట్ అయ్యింది. అంతా ఓకే కాని.. ప్రభాస్ సినిమాల అప్‌డేట్లు, మహేశ్ అండ్ కో సినిమాల అప్‌డేట్లతో వాళ్ళ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. కాని రామ్ చరణ్ ఫ్యాన్స్‌కే సింగిల్ అప్‌డేట్ లేక ఆకలి మీదున్నారు. కనీసం ఆగస్ట్ 15న లేదంటే వినాయక చవితికో అప్‌డేట్స్ వస్తాయా అంటే, అది కూడా కష్టమే అంటున్నారు.