తమన్ నువ్వసలు మనిషివేనా.. నీ కంటే ఊసరవెల్లి బెటర్.. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్..!
మనిషికి మాట చాలా అదుపులో ఉండాలి. అది ఏమాత్రం అదుపు తప్పినా కూడా నష్టం మామూలుగా ఉండదు. ఒకసారి నోరు జారిన తర్వాత వెనక్కి తీసుకోవడానికి లేదు. అది తుపాకీ తూటా కంటే వేగంగా ముందుకు వెళుతుంది.

మనిషికి మాట చాలా అదుపులో ఉండాలి. అది ఏమాత్రం అదుపు తప్పినా కూడా నష్టం మామూలుగా ఉండదు. ఒకసారి నోరు జారిన తర్వాత వెనక్కి తీసుకోవడానికి లేదు. అది తుపాకీ తూటా కంటే వేగంగా ముందుకు వెళుతుంది. తాజాగా తమన్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మనోడు నోరు జారలేదు.. ఏకంగా మాటలు మార్చేసాడు. ఒకప్పుడు తాను అన్న మాటలు మర్చిపోయి.. ఇప్పుడు వాటినే మార్చేశాడు. ఎప్పుడో పదేళ్ల కింద చెప్పిన మాటలను కూడా వెనక్కి తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఆడుకుంటున్న రోజులువి. ఈయన ఆరు నెలల కింద మాట్లాడిన మాటలే ఇప్పుడు మార్చి మాట్లాడితే ఫ్యాన్స్ ఊరుకుంటారా చెప్పండి..! అది కూడా పోయి రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పెట్టుకున్నాడు తమన్. తెలిసి అన్నాడో తెలియక అన్నాడో తెలియదు కానీ తమన్ అయితే దారుణంగా బుక్ అయిపోయాడిప్పుడు.
మనోడిని వదిలే ముచ్చట లేదు అంటున్నారు మెగా ఫాన్స్. అసలే గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయిందని బాధలో ఉన్నారు రామ్ చరణ్ అభిమానులు. దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా మరచిపోవాలని ప్రయత్నిస్తుంటే.. పుండు మీద కారం చల్లినట్టు ఇప్పుడు తమన్ మళ్లీ గేమ్ ఛేంజర్ సినిమానే కావాలని గెలికాడు. ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందు సాంగ్స్ కు సూపర్ అది కాకపోయినా ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు తమన్ తమన్ కూడా గేమ్ చేంజర్ మ్యూజిక్ గురించి గొప్పగా చెప్పాడు. పాటల్లో డాన్సులు కూడా అదిరిపోతాయని.. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని విధంగా ఆ డ్యాన్సులు ఉండబోతున్నాయి అంటూ చాలా గొప్పగా చెప్పాడు. కానీ ఇప్పుడు అదే తమన్ ప్లేట్ మార్చేశాడు. రీసెంట్ గా ఓ డాన్స్ షోకు హాజరైన తమన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. స్టేజ్ మీద ఒక అమ్మాయి గేమ్ చేంజర్ పాటకు డాన్స్ చేసింది.. సినిమాలో ఉన్న స్టెప్పుల కంటే 1000 రెట్లు గొప్పగా చేశావ్.. అసలు ఒరిజినల్ వెర్షన్‌లో ఈ స్టెప్పులు ఉంటే బావుండేదంటూ బాంబు పేల్చాడు తమన్.
అంతేకాదు ఇంకో ఇంటర్వ్యూలో.. గేమ్ చేంజర్ సినిమాలోనీ పాటల్లో హుక్ స్టెప్స్ లేవని.. ఈరోజుల్లో ఒక పాటలో సిగ్నేచర్ స్టెప్ లేకపోతే పాట హీట్ అవ్వదు అని చెప్పుకొచ్చాడు తమన్. కానీ ఇదే సంగీత దర్శకుడు ఆరు నెలల ముందు ఒక టీవీ షోలో గేమ్ చేంజర్ సినిమాలోని ప్రతి పాటలో సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయని చెప్పాడు. ఇప్పుడేమో సినిమాలో అసలు స్టెప్స్ లేవని రామ్ చరణ్ అభిమానుల ఈగోను దెబ్బతీశాడు. దాంతో మెగా ఫ్యాన్స్ అన్ని పనులు మానేసుకొని తమన్ పని మీద కూర్చున్నారు ఇప్పుడు. అందుకే ఆయనను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. గతంలో తమన్ గేమ్ ఛేంజర్ సాంగ్స్ ను పొగిడిన మాటలను, ఇప్పుడు విమర్శించిన పాటలను కలిపి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. థియేటర్లో ఈ పాట రచ్చ రచ్చే… మాములుగా ఉండదు.. డాన్స్ కూడా ఇరగదీశారు అని రిలీజ్ కు ముందు చెప్పిన తమన్.. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అవ్వగానే మాట మార్చి ఇలా డాన్స్ చేసి ఉంటే ఇంకోలా ఉండేది అంటూ కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు వాళ్ళు. నీకంటే ఊసరవెల్లి చాలా బెటర్.. రంగులు మార్చడానికి అది కాస్త టైమ్ అయినా తీసుకుంటుంది నువ్వు మాటలు మార్చడానికి ఆ టైం కూడా తీసుకోవట్లేదు అంటూ తమన్ ను టార్గెట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు రామ్ చరణ్ కూడా ఈ కామెంట్స్ మీద సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఇన్స్టాగ్రామ్ లో తమన్ ను అన్ ఫాలో చేసాడని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా సినిమా హిట్ అయితే ఒకలాగా ఫ్లాప్ అయితే మరోలాగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు.