దేవర 50 కోట్లు కొల్లగొట్టిన నగరం… దాని మీద మెగా స్కెచ్…

ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన దేవర ఏ గడ్డ మీదైదే 50 కోట్లు కలెక్ట్ చేసిందో... ఏ గడ్డ మీద ఖాన్లు, కపూర్లు కూడా అంత ఎమౌంట్ ని రాబట్టలేకపోయారో, ఆ ఏరియాలో జెండా ఎగరేసే స్కెచ్ వేశాడు మెగా పవర్ స్టార్.. త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ గ్లోబల్ స్టార్స్ గా ఫోకస్ అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 6, 2024 | 06:16 PMLast Updated on: Nov 06, 2024 | 6:16 PM

Ram Charan Focus On Lucknow City

ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన దేవర ఏ గడ్డ మీదైదే 50 కోట్లు కలెక్ట్ చేసిందో… ఏ గడ్డ మీద ఖాన్లు, కపూర్లు కూడా అంత ఎమౌంట్ ని రాబట్టలేకపోయారో, ఆ ఏరియాలో జెండా ఎగరేసే స్కెచ్ వేశాడు మెగా పవర్ స్టార్.. త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ గ్లోబల్ స్టార్స్ గా ఫోకస్ అయ్యారు. దేవరతో పాన్ ఇండియాని సోలోగా షేక్ చేసి ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకోవటమేకాదు… హిందీ హీరోలకు కూడా సాధ్యం కాని వసూళ్లని నార్త్ ఇండియాలో ఒక ఫేమస్ సిటీలో రాబట్టాడు… అయితే ఇప్పడు అక్కడ జెండా ఎగరేస్తే కాని, నిద్రపట్టదనంటున్నాడు రామ్ చరణ్. అందుకు సరిపోదా శనివారం మంటూ డైలాగ్ తను విసిరితే, సరిపోలేదు శనివారం అంటూ అల్లు అర్జున్ కూడా సేమ్ ఎటాక్ కి సిద్దమయ్యాడు. సో చరణ్, ఎన్టీఆర్, బన్నీ ఈ ముగ్గురిని పోటీ పడేలా చేసిన ఆ ఊరేంటి? దాని వెనకున్న రికార్డుల హిస్టరీ ఏంటి? 

దేవర కి ఎన్ని వందలకోట్ల వసూళ్లు వచ్చాయనే కంటే,ఒక సిటీలో ఎవరికీ రానంత వసూళ్లు తన మూవీకి దక్కాయనేదే నార్త్ ఇండియాలో ఓ పెద్ద రికార్డ్.. ఆరికార్డే దేవరకి వచ్చింది. నార్త్ ఇండియా రాష్ట్రాల్లో 80 కోట్ల జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్ రాజదాని, లక్నౌలో దేవర ఏకంగా 50 కోట్ల వసూళ్లు రాబట్టింది. అలాంటి రికార్డు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇలా ఖాన్లు కపూర్లకు కూడా దక్కలేదు.

కాని దేవరకి వచ్చింది.. అందుకే మరి ఆ సిటీ మీద రామ్ చరణ్ కన్నేశాడో, లేదంటే త్రిబుల్ ఆర్ లో ఎన్టీఆర్, చరణ్ కలిసి రికార్డులు క్రియేట్ చేసినట్టే, ఇప్పుడు ఒకే నగరంలోని రికార్డులని పంచుకోవాలనుకుంటున్నాడో.. కాని లక్నౌలో గేమ్ ఛేంజర్ టీజర్ ని లాంచ్ చేయబోతున్నారు

దేవర ట్రైలర్ ముంబౌలో ఎన్టీఆర్ లాంచ్ చేస్తే, గేమ్ ఛేంజర్ టీజర్ ని లక్నౌలో లాంచ్ ప్లాన్ చేసి రామ్ చరణ్ షాక్ ఇస్తున్నాడు. కేవలం ఆ సిటీలో టీజర్ లాంచ్ చేస్తే చూస్తారా? అంటే, అక్కడే దేవర కనిపెట్టిన లాజిక్ మ్యాజిక్ చేస్తోంది.

త్రిబుల్ ఆర్ వల్ల ఎన్టీఆర్ కి నార్త్ ఇండియాలో భీముడిగా గుర్తింపు దక్కితే, రామ్ చరణ్ కి రాముడిగా గుర్తింపు వచ్చింది. సో దేవరకి ఎలాగైతే లక్నౌకలిసొచ్చిందో, అక్కడి పాపులేషన్, వాళ్ల సినిమా ఇంట్రస్ట్ … ఇవన్నీ కలిసొచ్చే విషయాలు..

అందుకే తెలివిగా లక్నౌని టార్గెట్ చేశాడు చరణ్. మోస్ట్ లీ ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ రావచ్చనేది ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. సో ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో లక్నౌలో 50 కోట్లు రాబట్టిన రికార్డు సొంతం చేసుకున్న తారక్, లక్నౌలో జరిగే గేమ్ ఛేంజర్ టీజర్ ఈవెంట్ కి రావటం అంటే, మరో రికార్డు క్రియేట్ అయినట్టే…

అయితే ఇక్కడ మరో కామన్ పాయింట్ ఏంటంటే లక్నౌలో పుష్ప 2 ని ఏకంగా 90 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అంటే దేవర తాలూకు లక్నౌలో ని 50 కోట్ల వసూళ్ల రికార్డుని బన్నీ కూడా టార్గెట్ చేశాడని తెలుస్తోంది. నార్త్ ఇండియాలో ఒక సిటీలో ఇలా 50 కోట్లు రాబట్టొచ్చని ఎన్టీఆర్ దారి చూపిస్తే, ఇప్పుడా దారిలో చరణ్, బన్నీ నడుస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈ శనివారం లక్నౌలో గేమ్ ఛేంజర్ టీజర్ రాబోతుంటే, ఆతర్వాత 16 అంటే ఆపై వచ్చే శనివారంకి పుష్ప2 ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నారు. అది కూడా పుష్ప 2 టీం లోని నటులు, దర్శక, నిర్మాతలు ఒక్కో సిటిలో అంటే, లక్నౌ, ముంబై, కేరళాలో ట్రైలర్ ని ఒకే సారి లాంచ్ చేయబోతున్నారు.
ఇంతగా ఎన్నడూ లేంది నార్త్ మార్కెట్ అంటే ముంబై తప్ప మరో సిటీని పట్టించుకోని బీటౌైన్ హీరోలకి, కూడా లక్నౌలో ప్రమోషన్ ఎంత ఇంపార్టెంటో ముగ్గురు తెలుగు హీరోలు తెలిసేలా చేస్తున్నారు.