GAME CHANGER: ప్రభాస్ వర్సెస్ రామ్ చరణ్.. ఇది ఊహించని పరిణామం..
ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్, గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ మధ్యా వార్ మొదలయ్యేలా ఉంది. జూన్ 27న కల్కి రావటం కన్ఫామ్ అయ్యింది. అయితే ఇదే జూన్‌లో రెండో వారం భారతీయుడు 2 రాబోతోంది. జూన్ మూడో వారం గేమ్ ఛేంజర్ రిలీజ్ అని ఎనౌన్స్ చేయాలనుకున్నారు.

The 'game changer' that finally went
GAME CHANGER: ఒకే నెలలో ఇద్దరు, ముగ్గురు టాలీవుడ్ స్టార్స్ సినిమాలు పోటీ పడితే ఇక్కడి మార్కెట్‌లోనే కాదు, పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ షురూ అవుతుంది. అదే ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్, గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ మధ్యా వార్ మొదలయ్యేలా ఉంది. జూన్ 27న కల్కి రావటం కన్ఫామ్ అయ్యింది. అయితే ఇదే జూన్‌లో రెండో వారం భారతీయుడు 2 రాబోతోంది.
RAM CHARAN: చిరు, చరణ్‌కి ఆసక్తి ఉన్న కాలం కలిసిరాలేదా..?
జూన్ మూడో వారం గేమ్ ఛేంజర్ రిలీజ్ అని ఎనౌన్స్ చేయాలనుకున్నారు. కాకపోతే శంకర్ డైరెక్ట్ చేసిన భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ ఇలా రెండూ కూడా వారం గ్యాప్‌లో రిలీజ్ అవటం, అలా చేస్తారనుకోవటం మూర్ఖత్వమే. అందుకే జులైలో భారతీయుడు 2, జూన్ రెండో వారం గేమ్ ఛేంజర్‌ని రిలీజ్ చేయాలనుకున్నాడు దిల్ రాజు. కాని కల్కి డిస్ట్రిబ్యూషన్‌లో తను కూడా పార్టిసిపేట్ చేస్తుండటంతో, జులై సెకండ్ వీక్‌లో గేమ్ ఛేంజర్ విడుదలకు ప్లాన్ చేశాడట. అలా చూసినా కల్కికి, గేమ్ ఛేంజర్‌కి రెండు వారాల గ్యాపే ఉంటుంది.
అది కూడా పోటీ ఇచ్చేందుకు కారణం అవుతుంది. ఏదేమైనా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఏదో ఒక నెలలో గేమ్ ఛేంజర్ అంటూ ప్రచారం జరుగుతోంది. వాటన్నింటికీ బ్రేక్ వేస్తూ జులై సెకండ్ వీక్‌లో కిక్ ఇచ్చేందుకు గేమ్ ఛేంజర్ టీం రెడీ అయ్యింది.