RAM CHARAN: శంకర్ నిర్ణయంతో పవన్, బన్నీ సినిమాలకు షాక్..!
శంకర్ గేమ్ ఛేంజర్ రెండు నెలల్లో పూర్తవుతుంది. ఐదునెలల తర్వాతే వస్తుందని దిల్ రాజు తేల్చాడు. అంటే దిల్ రాజు ఐదునెలలు ఆగమన్న మాటల ప్రకారం చూస్తే ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లోనే గేమ్ ఛేంజర్ వచ్చే అవకాశం ఉంది.

RAM CHARAN: రామ్ చరణ్‌తో శంకర్ తీస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. రెండు నెలల్లో షూటింగ్ అయిపోతుందన్నాడు నిర్మాత దిల్ రాజు. ఇందులో మూడు పాటలు తూటాల్లా పేలుతాయన్నాడు. కాకపోతే ఈ దిల్ రాజు మామని మెగా ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా ఐదునెలల వరకు నో అప్ డేట్స్, నో లీక్స్ అంటున్నాడు. ఆ మాటలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. మీమ్స్, ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. అయితే ఐదునెలల వరకు ఓపికపట్టండన్న దిల్ రాజు మాటలు పుష్ప 2, ఓజీ సినిమా టీం ని కంగారు పెట్టించేలా ఉన్నాయి.
CHIRANJEEVI: వైరల్ ట్వీట్.. బెంగుళూరులో నీటి సమస్యపై చిరు రియాక్షన్
శంకర్ గేమ్ ఛేంజర్ రెండు నెలల్లో పూర్తవుతుంది. ఐదునెలల తర్వాతే వస్తుందని దిల్ రాజు తేల్చాడు. అంటే దిల్ రాజు ఐదునెలలు ఆగమన్న మాటల ప్రకారం చూస్తే ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లోనే గేమ్ ఛేంజర్ వచ్చే అవకాశం ఉంది. కాని ఆగస్ట్ 15న అల్లు అర్జున్ పుష్ప 2 ఉంది. సరే సెప్టెంబర్‌లో గేమ్ ఛేంజర్ వస్తుందనుకుంటే.. అప్పుడు ఓజీ రాబోతోంది. ఒక వేళ ఆగస్ట్ 15కి పుష్ప సీక్వెల్ రావటం కష్టం కాబట్టి, ఆ తేదీన గేమ్ ఛేంజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నారా? లేదంటే సెప్టెంబర్‌లో బాబాయ్ మూవీ ఓజీకి ముందే గేమ్ ఛేంజర్‌ని విడుదల చేస్తాడా? ఈ డౌట్లు వస్తున్నాయి.
అది కాకుండా దసరాకు ప్లాన్ చేయొచ్చంటే, తన స్నేహితుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ అక్టోబర్ 10కి రాబోతోంది. కాబట్టి.. ఇలా అందరికీ దారిచ్చుకుంటూ పోతే దీపావళి అంటే నవంబర్‌లోనే మూవీ వచ్చే అవకాశం ఉంది. దిల్ రాజు మాటే నిజమైతే ఆగస్ట్, లేదా సెప్టెంబర్‌లో బన్నీ, లేదా పవన్ సినిమాలకు పోటీ ఇవ్వటం తప్ప మరో దారి లేదు.