Ram charan: సిద్ధూకు చరణ్ ప్రశంసలు.. టిల్లూ స్క్వేర్‌ సక్సెస్‌‌పై చరణ్ ట్వీట్

మెగా పవర్‌ స్టార్ నుంచి టిల్లన్నకు ప్రశంసలు రావడం ఇప్పుడు వైరల్‌గా మారింది. టిల్లు స్వ్కేర్ సెన్సేషనల్ హిట్‌తో సిద్ధు జొన్నలగడ్డపై ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్‌తో పాటు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 7, 2024 | 11:15 AMLast Updated on: Apr 07, 2024 | 1:08 PM

Ram Charan Heaps Praise On Tillu Square Congratulates Siddhu

Ram charan: టిల్లూ స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుడుతోంది. వసూళ్ల హవా కొనసాగుతోంది. రెండో వారంలోనూ కలెక్షన్లను జోరు కనిపిస్తోంది బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వసూళ్ల హవా కొనసాగిస్తోంది. అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ మ్యాజిక్‌ రెండో వారంలోనూ కలెక్షన్లపై జోరు చూపిస్తోంది. సుమారు రెండేళ్ల క్రితం రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తెరకెక్కింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీలో.. ఎప్పటిలాగే సిద్దు తన యాక్టింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.

Sai Pallavi: కథ నచ్చితేనే సినిమా.. సాయిప‌ల్ల‌వి డిమాండ్ చేయకుండానే 10 కోట్లా..?

అనుపమ అంద చందాలు, ఆఖరిలో నేహా శెట్టి ఎంట్రీ మూవీకి ఎక్స్‌ట్రా అట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ క్రమంలోనే మెగా పవర్‌ స్టార్ నుంచి టిల్లన్నకు ప్రశంసలు రావడం ఇప్పుడు వైరల్‌గా మారింది. టిల్లు స్వ్కేర్ సెన్సేషనల్ హిట్‌తో సిద్ధు జొన్నలగడ్డపై ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్‌తో పాటు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న సినిమాగా రిలీజై ఓవర్సీస్‌లోనూ సత్తా చాటుతున్న సిద్ధూపై ప్రముఖ హీరోలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక.. టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ముందుండే మెగాస్టార్ చిరంజీవి రీసెంంట్‌గా ఈ మూవీని చూసారు. అనంతరం చిత్ర బృందాన్ని ఇంటికి పిలిపించుకుని మరీ అభినందనలు చెప్పారు. ‘టిల్లు స్క్వేర్’ సినిమా చూశానని.. తనకు బాగా నచ్చిందని తెలిపారు. సినిమా చూస్తే వావ్ అనిపించిందంటూ ప్రశంసించారు. సిద్ధు అంటే ఇంట్లో వాళ్లందరికీ ఇష్టమంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక.. తండ్రికి తగ్గ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ అటు యాక్టింగ్‌లోనే కాదు.. మంచి మనస్సులోనూ తండ్రికి తగ్గ కొడుకుగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా తన మంచి మనస్సును బయటపెడుతుంటాడు.

ఇప్పుడు టిల్లు స్క్వేర్ విషయంలోనూ తన తండ్రిలాగానే చెర్రీ కూడా రియాక్ట్ అయ్యాడు. సిద్దూను అభినందించాడు. టిల్లు స్క్వేర్’ మూవీ యూనిట్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభినందనలు తెలిపాడు. ‘సిద్ధూ.. నీ అద్భుత విజయం పట్ల గర్వంగా ఉంది. హీరోయిన్ అనుపమ, దర్శకుడు మల్లిక్ రామ్, మ్యూజిక్ డైరెక్టర్లకు, నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్‌కు హృదయపూర్వక అభినందనలు’ అంటూ ప్రశంసించాడు. అటు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం టిల్లూ స్క్వేర్ టీమ్‌కు అభినందనలు తెలిపాడు. మొత్తానికి టిల్లూ స్క్వేర్ విజయంతో సిద్ధూ ఓ గొప్ప హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.