లోకీ సినీవర్స్ లో రామ్ చరణ్…?

ఒక సినిమాకు ఇంకో సినిమా సీక్వెల్ అనే మాట వింటూనే ఉంటాం. కాని ఎవరూ ఊహించని విధంగా ఒక సినిమాకు మరో సినిమాకు లింక్ పెట్టి సినీవర్స్ అనే పదాన్ని క్రియేట్ చేసాడు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 20, 2024 | 05:29 PMLast Updated on: Aug 20, 2024 | 5:29 PM

Ram Charan In Loki Cineverse

ఒక సినిమాకు ఇంకో సినిమా సీక్వెల్ అనే మాట వింటూనే ఉంటాం. కాని ఎవరూ ఊహించని విధంగా ఒక సినిమాకు మరో సినిమాకు లింక్ పెట్టి సినీవర్స్ అనే పదాన్ని క్రియేట్ చేసాడు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్. మల్టీ స్టారర్ కాదు దానమ్మ మొగుడు అనే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు ఇప్పుడు. కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ సినిమాకు విక్రం సినిమాకు లింక్ చేసాడు. వాటిని లియో సినిమాకు లింక్ పెట్టాడు. ఇలా ఒకే సబ్జెక్ట్ ను భిన్నంగా తీస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.

విక్రం సినిమాలో రోలెక్స్ పాత్రతో ఒక్క సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా ఖైదీ సీక్వెల్ ఉంటుందని దాన్ని విక్రం సీక్వెల్ కు లింక్ చేస్తాడని టాక్. రోలెక్స్ కి కూడా లింక్ చేయవచ్చని తమిళ జనాలు అంటున్నారు. ఇక ఇప్పుడు అమీర్ ఖాన్ తో ఒక సినిమా ప్లాన్ చేసాడు. ఆ సినిమాను వీటితో లింక్ చేస్తాడట. ఇప్పుడు రజనీ కాంత్ తో కూలి సినిమా చేస్తున్నాడు. దానికి విక్రం కి లింక్ ఉంటుందని సమాచారం. ఇలా ఒక సినిమా చూడాలంటే ముందు ఆ సినిమా చూడాల్సిందే అన్నట్టు మారుస్తున్నాడు లోకేష్.

ఇప్పుడు ఈ సినీవర్స్ లో రామ్ చరణ్ ని కూడా తీసుకెళ్ళే ప్లాన్ లో ఉన్నాడని టాక్. అమీర్ ఖాన్ తో చేయబోయే సినిమాలో లేదంటే… ఖైదీ సీక్వెల్ లో రామ్ చరణ్ కు మెయిన్ రోల్ ఇవ్వాలని భావిస్తున్నాడు. అందులో రామ్ చరణ్ ని పోలీస్ ఆఫీసర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. అమీర్ ఖాన్ తో చేయబోయే సినిమాలోనే రామ్ చరణ్ ను చూపించే ఛాన్స్ బాగా కనపడుతుంది. అలా ఆ పాత్రను కంటిన్యూ చేసి ఖైదీ సీక్వెల్, తర్వాత విక్రం సీక్వెల్ లో చూపిస్తాడని కూడా కథనాలు వస్తున్నాయి.