Ram Charan : రెమ్యూనరేషన్ పెంచేసిన రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ (Mega Pawan Star) రామ్ చరణ్ (Ram Charan). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న 50వ సినిమా అవడంతో.. ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కుతోంది గేమ్ చేంజర్.
ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ (Mega Pawan Star) రామ్ చరణ్ (Ram Charan). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న 50వ సినిమా అవడంతో.. ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కుతోంది గేమ్ చేంజర్. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల సమయం కేటాయించాడు చరణ్. దీంతో భారీ రెమ్యూనరేషన్ తిసుకుంటున్నట్టుగా టాక్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు 45 కోట్ల వరకు పారితోషికం అందుకున్న చరణ్.. గేమ్ చేంజర్‌కు 100 నుంచి 120 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి.
ఇక ఇప్పుడు 125 కోట్లకు చరణ్ రెమ్యునరేషన్ పెరిగినట్టుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్నాడు చరణ్.ఇప్పటికే గ్రాండ్‌గా ఈ సినిమాను లాంచ్ చేశారు. త్వరలోనే సెట్స్ తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. గేమ్ చేంజర్ షూటింగ్ అవడమే లేట్.. వెంటనే ఆర్సీ 16 షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు చరణ్. కుదిరితే.. జూన్‌లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం.
అయితే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న RC 16 కోసం రామ్ చరణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీకి చరణ్ ఏకంగా 125 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా అంత మొత్తంలో ఇవ్వడానికి ఓకె చెప్పినట్టుగా సమాచారం. అయితే ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.