రాజమౌళితో పెట్టుకున్నాడా..? గేమ్ ఛేంజవుతున్న టైంలో వివాదం..
గేమ్ ఛేంజర్ టీజర్ తుస్సుమంటే, ట్రైలర్ మాత్రం పేలింది. పాటలు పేలలేదనుకుంటే, గేమ్ ఛేంజర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తోంది. సడన్ గా గేమ్ ఛేంజర్ మీద నెగెటీవ్ టాక్ తగ్గి, హైప్ పెరిగింది.
గేమ్ ఛేంజర్ టీజర్ తుస్సుమంటే, ట్రైలర్ మాత్రం పేలింది. పాటలు పేలలేదనుకుంటే, గేమ్ ఛేంజర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తోంది. సడన్ గా గేమ్ ఛేంజర్ మీద నెగెటీవ్ టాక్ తగ్గి, హైప్ పెరిగింది. ఇలాంటి టైంలో గేమ్ ఛేంజ్ చేయాల్సింది పోయి రామ్ చరణ్ వివాదంలో చిక్కుకునేలా ఉన్నాడు. టంగ్ స్లిప్ అయ్యి ఏకంగా రాజమౌళితోనే పెట్టుకున్నాడు. గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మహేశ్ బాబు మూవీ మీద తను చేసిన కామెంట్ ని చాలా మంది పాజిటివ్ గా తీసుకున్నారు. కాని ఒక వర్గం ఎటాక్ షురూ చేసింది. మగధీర టైంలో రాజమౌళికి, రామ్ చరణ్ కి మధ్య వచ్చిన ఈగో క్లాషెస్ తర్వాత, ఈగ మూవీ వరకు కంటిన్యూ అయ్యాయి. త్రిబుల్ ఆర్ తో సీన్ మారిందనుకుంటే, మళ్లీ ఈగ రిలీజ్ టైంలో ఎలాంటి వివాదం చెలరేగిందో… ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అలాంటి కాంట్రవర్సీనే క్రియేట్ అవుతోంది.. ఇంతకి అందేంటో చూసేయండి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎవరి జోలికి వెల్లడు. టంగ్ స్లిప్ అవడు… కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. బేసిగ్గా ఈ కటౌట్ మీదున్న ఇంప్రెషన్ ఇది.. కాకపోతే గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈవెంట్ లో రాజమౌళి కొత్త మూవీ మీద తను విసిరిన సెటైర్ మిస్ ఫైర్ అయినట్టుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి తీసే సినిమా ఎప్పుడు వస్తుంది చరణ్ గారు అని సుమ అడిగిన ప్రశ్నకి, కరోనా లాంటి సిచ్చువేషన్స్ లేవు కాబట్టి, ఏడాదిన్నరలో వచ్చేయొచ్చు అన్నాడు
దీనికి రాజమౌళి కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చాననటంతో, అంతా నవ్వుకున్నారు. ఇందులో అసలు వివాదం ఏముంది… కాంట్రవర్సీకి స్కోప్ ఏది… ఇది కామన్ గా అందరికి వచ్చే డౌట్.. కాని సోషల్ మీడియాలో మాత్రం ఈ స్టేల్ మెంట్ మీదే చాలా పెద్ద చర్చ మొదలైంది.
ఎప్పుడో మగధీర, ఈగ టైంలో జరిగిన వివాదం, రాజమౌళి తో రామ్ చరణ్ కి ఉన్న ఈగో క్లాషెస్ మీద మళ్లీ ఇప్పుడు డిస్కర్షన్ పెరిగింది. ఐతే గేమ్ ఛేంజర్ మూవీని ప్రమోట్ చేయటానికే రాజమౌలి వచ్చాడు. కాబట్టి తన మీద రామ్ చరణ్ సెటైర్ వేశాడనలేం
కాని రాజమౌళి, మహేశ్ బాబు మూవీ ఎప్పుడొస్తుందంటే, అన్ని సెట్టైతే ఏడాదిన్నరలో అంటూ నవ్వాడు చరన్. అంటే రాజమౌళితో పెట్టుకుంటే, ఏది తేలదని పరోక్షంగా సెటైరిగ్గా అన్నట్టే… ఇదిచరణ్ మాటలకు చాలా మంది తీస్తున్న పెడర్ధం…
ఇలా అనటానికి కూడా కారణాలున్నాయి. గతంలో మగదీర లాంటి హిట్ పడ్డాక, అది అంతగా ఆడటానికి హీరోగా తాను కారణమంటే, కాదు దర్శకుడిగా రాజమౌళి కారణమంటూ ఈగో క్లాషెస్ నడిచాయన్నారు. దాంతోనే అసలు హీరో లేకుండా కమేడియన్ తో బ్లాక్ బస్టర్ కొట్టి చూపిస్తా అని, సునిల్ తో మర్యాద రామన్న తీసి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడన్నారు
చరణ్ కూడా అప్పటి వరకు పెద్దగా పేరులేని సంపత్ నద్దితో రచ్చ మూవీతీసి హిట్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.. ఇది అప్పట్లో జరిగిన ప్రచారం..ఐతే ఈగ మూవీ రిలీజ్ డేట్ డిలే అవుతున్న టైంలో ఓ ఈగను తరుముతూ రామ్ చరణ్ పెట్టిన వీడియో, బయటికెళ్లని ఈగ అంటూ జరిగిన రచ్చ వివాదంగా మారింది. అక్కడ కంటెంట్ ఉధ్దేశ్యం ఏదైనా, రాజమౌళి ఈగ మీద చరణ్ వేసిన సెటైర్ అది అన్నారు..
ఇదే నిజమైతే మళ్లీ చరణ్ ని, తారక్ తో కలిపి త్రిబుల్ ఆర్ తీసే అవకాశమే ఉండేది కాదు. సో అక్కడే రాజమౌళి తో తనకి ఎలాంటి డిఫరెన్సెస్ లేవని తేలింది. అయినా గేమ్ ఛేంజర్ ఈవెంట్ లో చరణ్ అన్న మాటకు పెడర్ధాలు తీయటం మాత్రం ఆగలేదు.