Ram Charan : రామ్ చరణ్ వల్ల డిప్రెషన్ లేదు..
ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ (Indian Greatest Director) శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరో (Vikram Hero) గా ఐ అనే మూవీ వచ్చింది. అందులో అంతకు మించి అనే ఒక డైలాగ్ ఉంటుంది.

Ram Charan is not depressed..
ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ (Indian Greatest Director) శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరో (Vikram Hero) గా ఐ అనే మూవీ వచ్చింది. అందులో అంతకు మించి అనే ఒక డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు అది మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) కి 100% వర్తిస్తుంది. చిరంజీవి నటవారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి వారసులంటే చరిత్రని ఫాలో అయ్యేవాళ్ళు కాదు అంతకు మించి అని నిరూపించాడు. సినిమాల పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్ లోను అంతకు మించి అని అనిపిస్తాడు. లేటెస్ట్ గా ఉపాసన కూడా అదే చెప్తుంది
చరణ్ వైఫ్ నేమ్ ఉపాసన(Upasana). ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరకీ ఒక పాప కూడా ఉంది. పేరు క్లీన్ కార..లేటెస్ట్ గా ఉపాసన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు తల్లి కావడం అనేది ప్రతి స్త్రీకి ఒక అద్భుతమైన ప్రయాణం. కానీ అది ఎన్నో సవాళ్ళని కూడుకున్నది. చాలా మంది లాగే నేను కూడా డెలివరీ తర్వాత వచ్చే తీవ్ర డిప్రెషన్ కి లోనయ్యాను. అప్పుడు చరణ్ నాకు ఎంతగో అండగా ఉన్నాడు.నాతో పాటు నా పుట్టింటికి కూడా వచ్చాడు.తన కూతురు విషయంలోను చాలా శ్రద్ద చూపిస్తాడు అని చెప్పుకొచ్చింది.
అదే విధంగా చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే విధంగా ఇంకో మాట కూడా చెప్పింది. క్లీన్ కార ఎన్నో విషయాల్లో తన తండ్రి పోలికల్ని పుణికి పుచ్చుకున్నట్టు చెప్పింది. ఆహారపు అలవాట్లు కూడా సేమ్ తండ్రిలాగే అని చెప్పింది. చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే దసరాకి ఆ మూవీ విడుదల కానుంది.త్వరలోనే అధికార ప్రకటన రానుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో కూడా ఒక మూవీ చేస్తున్నాడు