RAM CHARAN: రామ్ చరణ్‌కి ఊహించని విడుదల.. కారణం ఆ సినిమానే..
ఎట్టకేలకు భారతీయుడు 2 పూర్తైంది. అంటే ఇక శంకర్ పూర్తిగా గేమ్ ఛేంజర్ మీదే ఫోకస్ పెడతాడని తేలింది. ఫిబ్రవరిలోగా గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తౌతుందట. అందుకే బుచ్చి బాబు ప్లాన్ చేసిన చరణ్ మూవీ మార్చ్‌లో మొదలవుతుంది అంటున్నారు.

RAM CHARAN: మెగా పవర్ స్టార్ రామ చరణ్.. శంకర్ మూవీలో చిక్కుకుపోయాడు. రెండేళ్లుగా గేమ్ ఛేంజర్ తెరకెక్కుతూనే ఉంది. మధ్య మధ్యలోఆగిపోతూ ఉంది. అంతటికి లోకనాయకుడు కమల్ హాసన్‌తో శంకర్ తీస్తున్న భారతీయుడు 2 మూవీనే కారణం. ముందు ఇచ్చిన మాట ప్రకారం.. ఆగిపోయిన భారతీయుడు 2 పూర్తి చేశాకే మరో మూవీ చేయాల్సి రావటం వల్ల.. ఈ మూవీని, గేమ్ ఛేంజర్‌ని మార్చి మార్చి తీస్తూ వచ్చాడు శంకర్. ఎట్టకేలకు భారతీయుడు 2 పూర్తైంది.
Sandeep Reddy Vanga: మాస్టర్ పీస్.. చిరుతో సందీప్ వంగా నిజమేనా
అంటే ఇక శంకర్ పూర్తిగా గేమ్ ఛేంజర్ మీదే ఫోకస్ పెడతాడని తేలింది. ఫిబ్రవరిలోగా గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తౌతుందట. అందుకే బుచ్చి బాబు ప్లాన్ చేసిన చరణ్ మూవీ మార్చ్‌లో మొదలవుతుంది అంటున్నారు. రూ.390 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ఆ స్పోర్ట్స్ పీరియాడికల్ డ్రామా కోసం చరణ్ స్పెషల్ కసరత్తులు చేస్తున్నాడు. శంకర్ రెండేళ్లు సాగతీస్తూ తీసిన గేమ్ ఛేంజర్ వల్ల మెగా పవర్ స్టార్ చాలా వరకు మరో మూవీ చేయనంతగా ఖాలీగా నలిగిపోయాడు. ఇప్పుడు భారతీయుడు 2 పూర్తైందటే, గేమ్ ఛేంజర్‌ని శంకర్ పూర్తి చేస్తాడు. కాబట్టి తనకి శంకర్ నుంచి విడుదల, విముక్తి లభిస్తాయి. ఎందుకు శంకర్‌తో సినిమా ప్లాన్ చేశానా అనే పరిస్థితిలో ఉన్న చరణ్.. బుచ్చి బాబు మూవీని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాడట.
దానికి కారణం సలార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ చరణ్ మూవీని కూడా సమాంతరంగా తెరకెక్కించాలనుకోవటం. ఇది కొత్తగా వచ్చిన అప్‌డేట్. 2025 సంక్రాంతి నుంచి ప్రశాంత్ నీల్ సలార్ 2ని, అలానే చరణ్ సినిమాను ఒకేసారి మొదలు పెట్టబోతున్నాడట.