Ram Charan : రామ్ చరణ్ నయా లుక్…సోషల్ మీడియాషేక్
గత కొద్ది రోజులుగా మెగా పవర్ స్టార్ (Mega Power Star) ఫ్యాన్స్ అప్సెట్ అవుతునే ఉన్నారు. ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ (Game Changer) సినిమా నుంచి.. ఇప్పటి వరకు సాలిడ్ అప్డేట్ ఒక్కటి కూడా బయటికి రాలేదు.

Ram Charan new look...social mediashake
గత కొద్ది రోజులుగా మెగా పవర్ స్టార్ (Mega Power Star) ఫ్యాన్స్ అప్సెట్ అవుతునే ఉన్నారు. ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ (Game Changer) సినిమా నుంచి.. ఇప్పటి వరకు సాలిడ్ అప్డేట్ ఒక్కటి కూడా బయటికి రాలేదు. శంకర్ ఇంకా ఈ సినిమాను చెక్కుతునే ఉన్నాడు. దిల్ రాజు కూడా గేమ్ చేంజర్ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందనేది క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు కనీసం గ్లింప్స్ కూడా రిలీజ్ చేయడం లేదు శంకర్(Shankar).
షూటింగ్ స్టార్ట్ అయి ఏండ్లు గడుస్తున్న కూడా.. టైటిల్ తప్ప మరో అప్డేట్ ఇవ్వలేదు శంకర్. పోయిన దీపావళి జరగండి సాంగ్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసి.. వాయిదా వేశారు. ఇప్పటి వరకు జరగండి సాంగ్ ఊసే లేదు. దీంతో గేమ్ చేంజర్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తునే ఉన్నారు మెగా ఫ్యాన్స్. కానీ అప్పుడప్పుడు చరణ్ కొత్త ఫోటోలు చూసి ఖుషీ అవుతున్నారు.
లేటెస్ట్‌గా చరణ్ కొత్త ఫోటో ఒకటి బయటికి వచ్చింది. అందులో.. చరణ్ చాలా కూల్‌గా షార్ట్ హెయిర్ అండ్ లైట్ గడ్డంతో అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. దీంతో చరణ్ మస్త్ ఉన్నాడు. ఫోటో అదిరింది అంటూ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం చెర్రీ నయా లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే.. చరణ్ లేటెస్ట్ ఫోటో ఓ యాడ్ షూటింగ్‌కు సంబంధించినదిగా తెలుస్తోంది. దీంతో గేమ్ చేంజర్ అప్డేట్ మాత్రం ఇవ్వడం లేదని కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికైనా మేకర్స్ అప్డేట్ ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా.. గేమ్ చేంజర్ సంగతేమో గానీ.. చరణ్ లేటెస్ట్ పిక్ మాత్రం సూపర్ అనే చెప్పాలి.