RAM CHARAN: గ్లోబల్ స్టార్‌తో లేడీ సూపర్ స్టార్.. రామ్ చరణ్‌తో సాయిపల్లవి..

సాయిపల్లవి.. సౌత్ ఇండియా హీరోయిన్స్‌లో ఓ స్పెషల్ పర్సనాలిటీ. ఎక్స్‌పోజింగ్‌కు తావివ్వకుండా.. కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసుకుంటూ తనకంటూ సఫరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం చాలా మంది బ్యూటీలు పాన్ ఇండియా స్టేటస్ కోసం పాకులాడుతుంటే.. ఈ హైబ్రిడ్ పిల్ల మాత్రం నచ్చిన కథలను చేసుకుంటూపోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 16, 2023 | 06:46 PMLast Updated on: Nov 16, 2023 | 6:46 PM

Ram Charan Pairing With Sai Pallavi In Next Movie With Buchibabu Sana

RAM CHARAN: లేడీ పవర్ స్టార్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి సూపర్ చాన్స్ కొట్టేసింది. మొన్నటిదాకా చిన్న చిన్న హీరోలతో కట్టిన జతకట్టిన ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్‌తో స్టెప్పులు వేయబోతోంది. నిజమో కాదో తెలియదు కానీ ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాయిపల్లవి.. సౌత్ ఇండియా హీరోయిన్స్‌లో ఓ స్పెషల్ పర్సనాలిటీ. ఎక్స్‌పోజింగ్‌కు తావివ్వకుండా.. కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసుకుంటూ తనకంటూ సఫరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.

Rashmika Mandanna: బెడ్‌పై రష్మిక మందన్నా.. ఏంటా ట్వీట్.. అసలేమైంది..?

ప్రస్తుతం చాలా మంది బ్యూటీలు పాన్ ఇండియా స్టేటస్ కోసం పాకులాడుతుంటే.. ఈ హైబ్రిడ్ పిల్ల మాత్రం నచ్చిన కథలను చేసుకుంటూపోతోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి తాజాగా గ్లోబల్ స్టార్‌తో జతకట్టే అవకాశం దక్కినట్టుగా తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో కథానాయికగా ముందు మృణాళ్ పేరు వినిపించింది. ఆ తర్వాత జాన్వికపూర్ పేరు లైన్‌లోకొచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా సాయిపల్లవి పేరు వినిపిస్తోంది. రూరల్ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో కథ పరంగా హీరోయిన్ క్యారెక్టర్‌కి చాలా డెప్త్ ఉంటుందట. దానికి సాయిపల్లవి అయితేనే బాగుంటుందని బుచ్చిబాబు భావిస్తున్నాడట. దీనికి సాయిపల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నిజమో కాదో తెలియాలి అంటే మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాలి.