చరణ్ కి 1000 కోట్లొస్తే… 1000 కోట్లతో పాన్ వరల్డ్ మూవీ…!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత ఆచార్య మూవీ చేస్తే చేతులు కాలాయి. కొరటాల శివ ఎన్టిఆర్ కి, ప్రభాస్, మహేశ్ కి కలిసొచ్చినట్టు రామ్ చరణ్ కి కలిసి రాలేదు. దీంతో రాజమౌళి సినిమా తో హిట్ మెట్టెక్కాక, ఏ హీరో అయినా తర్వాత ఫ్లాప్ ఫేస్ చేయాల్సిందే అన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 28, 2024 | 02:35 PMLast Updated on: Sep 28, 2024 | 2:36 PM

Ram Charan Plan For Biggest Pan World Movie

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత ఆచార్య మూవీ చేస్తే చేతులు కాలాయి. కొరటాల శివ ఎన్టిఆర్ కి, ప్రభాస్, మహేశ్ కి కలిసొచ్చినట్టు రామ్ చరణ్ కి కలిసి రాలేదు. దీంతో రాజమౌళి సినిమా తో హిట్ మెట్టెక్కాక, ఏ హీరో అయినా తర్వాత ఫ్లాప్ ఫేస్ చేయాల్సిందే అన్నారు. ఆ సెంటిమెంట్ ని కొంతవరకు దేవరతో ఎన్టీఆర్ బ్రేక్ చేసినట్టున్నాడు. ఐతే సరే ఆచార్య పంచ్ ఇచ్చినా, గేమ్ ఛేంజర్ తో దుమ్ముదులపాలనుకున్న రామ్ చరణ్ కి ఆ హోప్స్ పోయినట్టున్నాయి. శంకర్ కాల్ చేసినా ఫోన్ ఎత్తని పరిస్థితి వచ్చింది. ఇలాంటి టైంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తన కల నెరవేర్చుకునేందుకు రామ్ చరన్ చేసే వెయ్యికోట్ల సాయం మీదే ఆశలు పెట్టుకున్నాడు. ఇంతకి చరణ్ కి, శంకర్ కి ఉన్న ఈ వెయ్యికోట్ల అనుబంధం ఏంటో చూసేయండి.

త్రిబుల్ ఆర్ తర్వాత సాలిడ్ హిట్ కోసం ప్రయత్నించిన చరణ్ కి ఆచార్య కోలుకోలేని దెబ్బ వేసింది. కట్ చేస్తే లివింగ్ లెజెండ్ శంకర్ తో సినిమా కాని అది సీరియల్ లా సాగుతూ, తూగుతూ ఇన్నాళ్లకు రిలీజ్ కి రెడీ అయ్యింది. పెద్ద దర్శకుడితో సినిమా అంటే ట్రెండ్ సెట్ అవుతుందని కమిటైన చరణ్, అసలు శంకర్ తో సినిమానే ప్లాన్ చేయకపోయుంటే, కనీసం రెండే ళ్లు మిగిలేవనుకునే పరిస్థితి వచ్చింది. అలాంటిది ఇప్పుడు శంకర్ కి వెయ్యికోట్ల సాయం రామ్ చరణే చేయాల్సి వస్తోంది. తను వెయ్యికోట్ల సాయం చేయకపోతే శంకర్ తన డ్రీమ్ ని వదులుకోవాల్సిందే..

అసలే శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్ తో భారతీయుడు సీక్వెల్ తీసి, ఊహించని దెబ్బ పడేలా చేశాడు. ఈ సినిమా తీసింది శంకరా అనే డౌట్ వచ్చేలా చేశాడు. ఈ మూవీ పుణ్యమాని వెంటనే గేమ్ చేంజర్ ని రిలీజ్ చేస్తే, అది కూడా బెడిసి కొడుతుందనే కంగారుతో, దిల్ రాజు ఈ మూవీని డిసెంబర్ 20కి వాయిదా వేశాడు

విచిత్రం ఏంటంటే డిసెంబర్ 20 తర్వాత అర్జెంట్ గా శంకర్ కి వెయ్యికోట్లు కావాలి.. ఆవెయ్యికోట్లతో భారీగా ప్రయోగం చేయబోతున్నాడు. అది కూడా పాన్ ఇండియా లెవల్లో ఒకటి కాదు, రెండు కాదు, మూడు భాగాలుగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. తమిళ హీరో సూర్య, విక్రమ్ లతో కలిసి ప్లాన్ చేస్తున్న మూవీ వేల్పారి నవల ఆధారంగా తెరకెక్కబోతోంది.

ఒక్కో పార్ట్ కి 350 కోట్ల బడ్జెట్ వేసినా 1100 కోట్ల ఖర్చయ్యేలా ఉంది. అంత పెట్టుబడి శంకర్ ని నమ్మి ఎవరైనా పెడతారా అంటే, భారతీయుడు 2 చూసిన ఏ నిర్మాత అంత సాహసం చేయడు. రోబో తర్వాత తను తీసిన నన్బన్, ఐ, రోబో2.0, భారతీయుడు 2 అన్నీ డిజాస్టర్లయ్యాయి. అలాంటప్పుడు శంకర్ 1000 కోట్ల ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే తీసేందుకు నిర్మాతకు ధైర్యం ఉండాలి.. తనమీద నమ్మకం ఉండాలి.

అదే జరగాలంటే గ్లోబల్ స్టార్ రామ్ చరన్ తో తను తీసిన గేమ్ ఛేంజ్ భారీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అలా అవుతుందా? అంటే రామ్ చరణ్ క్రేఝ్ కి ఈజీగా ఈ సినిమా కూడా దేవరలానే మొదటి రోజే వందకోట్లు రాబట్టే సీన్ ఉంది. అంత భారీ ఓపెనింగ్స్ వచ్చేంత క్రేజ్ సౌత్, నార్త్ లో రామ్ చరణ్ కి ఉంది. కాని రెండో రోజు కూడా ఆ రేంజ్ లోనే వసూళ్లు రావాలి.. అవే వెయ్యికోట్ల వరకు సాగాలి.. అదే జరుగుతుందా? అదే జరిగితే కాని శంకర్ ని నమ్మ వెయ్యికోట్ల బడ్జెట్ తో ఎవరూ మరో ప్రయోగం తీయలేరు. కాబట్టే రామ్ చరణ్ థౌజెండ్ వాలాగా మారితే తప్ప, శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్టుకి నిర్మాతను పట్టుకోలేడు..