Ram Charan: హాలీవుడ్‌ డైరెక్టర్స్‌కు కండీషన్స్‌ పెట్టిన చెర్రీ.. వాటికి ఓకే అంటే సినిమా స్టార్ట్‌..

ట్రిపులార్‌ సినిమాతో రామ్‌ చరణ్‌ ఫేట్‌ మారిపోయింది. ఇప్పుడాయన నార్మల్‌ హీరో కాదు. గ్లోబల్‌ స్టార్‌. చెర్రీ ఫ్యాన్స్‌ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హాలీవుడ్‌ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు రామ్‌ చరణ్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 23, 2023 | 06:04 PMLast Updated on: May 23, 2023 | 6:04 PM

Ram Charan Say Conditions To Bollywood Directors

కశ్మీర్‌లో నిర్వహించిని జీ20 టూరిజం సమ్మిట్‌లో హాలీవుడ్‌ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. కశ్మీర్‌లో టూరిజం, ఫిలిం మేకింగ్‌ను డెవలప్‌ చేసేందుకు జీ20 దేశాల సమ్మిట్‌ నిర్వహించారు. ఈ సమ్మిట్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నాడు రామ్‌ చరణ్‌. ఇండియాలో చాలా అందమైన ప్లేస్‌లు ఉన్నాయని.. తాను తరువాత చేయబోయే సినిమాల్లో దాదాపు షూటింగ్‌ అంతా ఇండియాలోనే షూట్‌ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు.

తాను హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా అక్కడి డైరెక్టర్లకు కూడా ఇదే కండీషన్‌ పెడతానని చెప్పాడు. ఇండియాలో ఉన్న లొకేషన్స్‌ను ప్రపంచానికి చూపించాలని తాను ఫిక్స్‌ అయ్యానని చెప్పాడు. మిగిలిన సినిమా యాక్టర్స్‌ డైరెక్టర్లకు కూడా ఇదే విషయాన్ని చెప్పదల్చుకున్నట్టు చెర్రీ చెప్పాడు. అన్ని సినిమాల్లో దాదాపు ఇండియాలో ఉన్న మంచి లొకేషన్స్‌ అన్నీ వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పాడు. ఇండియాలో నార్త్‌ సౌత్‌ అంటూ రెండు ఇండస్ట్రీలు లేవని.. ఉన్నది ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీ మాత్రమేనని చెప్పాడు.

తన జీవితంలో ట్రిపులార్‌ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నాడు. జపాన్‌లో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌ను జీవితంలో మర్చిపోలేనంటూ చెప్పాడు. తనకు ఉపాసనకు జపాన్‌లో చాలా మంచి అనుభవాలు ఉన్నాయంటూ చెప్పాడు. చెర్రీ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ట్విటర్లో వైరల్‌ అవుతున్నాయి. చెర్రీ ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌ కాబట్టి హాలీవుడ్‌లో అవకాశాలు రావడం కామన్‌. ఒకవేళ చెర్రీ చెప్పిన కండీషన్స్‌కు అక్కడి డైరెక్టర్లు ఒకే అంటే.. త్వరలనే ఇండియాలో హాలీవుడ్‌ సినిమా షూటింగ్‌ జరగబోతోందని చెర్రీ ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు.