RAM CHARAN: అరుదైన గౌరవం.. రామ్ చరణ్‌కి డాక్టరేట్..
చరణ్ తాజాగా ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. చెన్నైకి చెందిన ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ.. చరణ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. కళారంగంలో అందించిన సేవలకుగాను ఆ అవార్డుని అందిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది.

RAM CHARAN: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. ఈ విషయాన్ని చెర్రీ చాలా సందర్భాల్లో చెప్పాడు. పైగా తన తండ్రి చిరంజీవి తర్వాతి స్థానం పవన్‌దే అని కూడా చెప్పాడు. పవన్‌కి కూడా చెర్రీ అంటే ఎంతో అభిమానం. చాలా ఫంక్షన్స్‌లో పవన్ ఈ విషయాన్ని చెప్పాడు. ఇద్దరకీ కంబైన్డ్ ఫ్యాన్స్ కూడా భారీగానే ఉన్నారు. ఇప్పుడు ఆ ఇద్దరికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది.
Allu Arjun: అన్నీ గాలి వార్తలే.. అల్లు అర్జున్‌ను పక్కన పెట్టిన అట్లీ
చరణ్ తాజాగా ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. చెన్నైకి చెందిన ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ.. చరణ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. కళారంగంలో అందించిన సేవలకుగాను ఆ అవార్డుని అందిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా చరణ్‌కి కంగ్రాట్స్ చెప్తున్నారు. ఏప్రిల్ 13న ఒక కార్యక్రమం జరిపి డాక్టరేట్‌ని ప్రకటిస్తారనే టాక్ అయితే వినపడుతుంది. కాకపోతే ఇక్కడ ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే కొన్నాళ్ల కితమే పవన్ కళ్యాణ్‌కి కూడా వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్‌ని ప్రకటించింది. కారణాలు తెలియదుగాని పవన్ దాన్ని తిరస్కరించారు. అయితే ఇప్పుడు అబ్బాయి రామ్ చరణ్ డాక్టరేట్‌ని అందుకోవడం విశేషం. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా జరగండి అనే సాంగ్ రిలీజ్ అయ్యింది.
ప్రస్తుతం అది సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఆ తర్వాత బుచ్చి బాబు సనాతో ఒక మూవీని చెయ్యబోతున్నాడు. ఇటీవలే ఆ మూవీ స్టార్ట్ అయ్యింది. కాగా సినిమా పరిశ్రమకి చెందిన చాలా మంది నటులు డాక్టరేట్‌లు అందుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో చరణ్ కూడా చేరాడు.