Ram Charan: గుడ్ న్యూస్.. బాలీవుడ్ ఫిల్మ్‌కు ఓకే చెప్పిన రామ్ చరణ్
'ఆర్ఆర్ఆర్' నుంచి నార్త్‌లో చరణ్ పేరు మారుమోగిపోతోంది. ఈ క్రమంలో మరోసారి ఆయన బాలీవుడ్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ లైనప్ దిమ్మ తిరిగేలా ఉంది. శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' చేస్తున్న చరణ్.. ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో స్పోర్ట్స్ డ్రామా చేయనున్నాడు.

Ram Charan: ఎవరైతే విమర్శించారో వారి చేతే ప్రశంసలు అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. దానిని సాధ్యం చేసి చూపించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా 2007లో ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగాడు. అదే ఊపులో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోగా ఊహించని షాక్ తగిలింది. 2013లో జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు చరణ్.
Anushka Shetty: లెక్క మారింది.. పవన్ ఔట్.. అనుష్క ఇన్
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘జంజీర్’కి రీమేక్ ఇది. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయింది. ఆ సమయంలో బాలీవుడ్ క్రిటిక్స్.. చరణ్ లుక్స్, యాక్టింగ్ గురించి దారుణంగా ట్రోల్ చేశారు. ఆ దెబ్బతో చరణ్.. హిందీ సినిమాల జోలికి పోలేదు. అయితే ‘జంజీర్’ వచ్చిన 9 ఏళ్ల తర్వాత.. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’తో నార్త్ ప్రేక్షకులను ఫిదా చేశాడు చరణ్. ఈ మూవీలో చరణ్ యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్‌కి బాలీవుడ్ ఆడియన్స్‌తో పాటు క్రిటిక్స్ కూడా ఫిదా అయ్యారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ నుంచి నార్త్‌లో చరణ్ పేరు మారుమోగిపోతోంది. ఈ క్రమంలో మరోసారి ఆయన బాలీవుడ్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ లైనప్ దిమ్మ తిరిగేలా ఉంది.
శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్న చరణ్.. ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో స్పోర్ట్స్ డ్రామా చేయనున్నాడు. దాని తర్వాత దర్శకుడు సుకుమార్‌తో ఒక సినిమా చేసే అవకాశముంది. ఇదిలా ఉంటే తాజాగా చరణ్ ఓ బాలీవుడ్ ఫిల్మ్ సైన్ చేసినట్లు తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. బాక్సాఫీస్ దగ్గర కాసులు కొల్లగొట్టే క్లాసిక్ చిత్రాలు అందించడం భన్సాలీ శైలి. అలాంటి దర్శకుడు.. రామ్ చరణ్‌తో సినిమా చేస్తే బాక్సాఫీస్ షాక్ అవుతుంది అనడంలో సందేహం లేదు.