RAM CHARAN: ఓటు వేసేందుకు రామ్ చరణ్ చేసిన పనికి ఫిదా..!
కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథకు శంకర్ స్టయిల్ ట్రీట్‌మెంట్ తోడవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రామ్ చరణ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

RAM CHARAN: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని కనబర్చి, తండ్రికి తగ్గ వారసుడిగా పేరుసంపాదించుకున్నాడు. ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న చెర్రీ, ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో జరిగే కథగా గేమ్ చేంజర్ రూపు దిద్దుకోబోతుంది.
Kamal Haasan vs Rajinikanth: బిగ్ ఫైట్.. సిల్వర్ స్క్రీన్‌పై రజినీ కమల్ ఫైట్..!
కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథకు శంకర్ స్టయిల్ ట్రీట్‌మెంట్ తోడవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రామ్ చరణ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మైసూరులో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ జరుగుతోంది. కానీ, ఓటు వేయడానికి దర్శక నిర్మాతల పెర్మిషన్‌తో హైదరాబాద్ చేరుకున్నాడు రామ్ చరణ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం రామ్ చరణ్‌ది.
నాన్నను పోలిన నటన, బాబాయి పవన్ కళ్యాణ్‌ను పోలిన ఛరిష్మాలతో చరణ్.. మెగా అభిమానులకు తమ ఇంటి కుర్రాడిగా మారిపోయాడు. ఇప్పుడు తన అభిమానులను కూడా, ఓటు హక్కు అందరూ వినియోచించుకోవాలని, ఈ సంఘటన ద్వారా చెప్పకనే చెప్పుకొస్తున్నాడు. కాగా, నావంబర్ 30 వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ మూడవ తేదీన విడుదలకానున్నాయి.