Ram Charan: ఏంటీ.. గ్లింప్స్ కోసం ఇంత ఖర్చు చేశారా ?
సినిమా అంటేనే మనీ మాటర్స్. పైసా లేకపోతే అక్కడ ఏ పనీ జరగదు. మనకు కావాల్సిన అవుట్‌పుట్ రావాలి అనుకున్నప్పుడు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ పరిస్థితి కూడా అంతే. నిన్నటి వరకూ RC15 వర్కింగ్ టైటిల్‌తో కొనసాగిని ఈ సినిమాకు ఇవాళే టైటిల్ ఫైనల్ చేశారు మూవీ టీం.
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ గ్లింప్స్ వీడియో క్రియేట్ చేసి టైటిల్ ఎనౌన్స్ చేశారు. ఈ గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ వీడియో క్రియేషన్‌కు డైరెక్టర్ శంకర్ భారీగా ఖర్చు చేసినట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. జస్ట్ గ్లింప్స్ కోసమే ఏకంగా 70 లక్షలు ఖర్చు చేశారట. టైటిల్ ఎనౌన్స్ చేసేందుకు 12 శాంపిల్స్ రెడీ చేయించాడట డైరెక్టర్ శంకర్. అందులో బెస్ట్ అవుట్‌పుట్‌ను ఫైనల్ చేసి రిలీజ్ చేశారట. వీడియో అదిరిపోయినా.. దానికి చేసిన ఖర్చు మాత్రం షాకిచ్చేలా ఉందంటున్నారు ఫ్యాన్స్.
ఇక సినిమా విషయంలో కూడా బడ్జెట్ లిమిట్ క్రాస్ చేశాడట శంకర్. ఈ సినిమాను 200 కోట్ల బడ్జెట్‌తో ఫైనల్ చేశారు. కానీ ఇప్పటికే సినిమాకు 280 కోట్లు ఖర్చైందట. ఇక్కడ ఇంట్రస్టింగ్ టాపిక్ ఏంటంటే సినిమా షూటింగ్ 70 పర్సెంట్ మాత్రమే పూర్తైంది. మొత్తం షూటింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి బడ్జెట్ 350 కోట్లు దాటుతుందని క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. బడ్జెట్ విషయంలో దిల్‌రాజు కూడా శంకర్‌కు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారట. ట్రిపులార్ లాంటి మాస్టర్‌పీస్ తరువాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. వాటికి తగ్గట్టుగానే శంకర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. టైటిల్ గ్లింప్స్ విషయంలో ఇంత పర్టికులర్‌గా ఉన్నాడంటే ఇక సినిమా ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో చూసేందుకు ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.