RAM CHARAN: గ్లోబల్ ముదురు అనిపించుకుంటున్న మెగా పవర్ స్టార్
బుచ్చి బాబు మూవీ, సుకుమార్ సినిమాతోపాటు చరణ్ మొన్నే సంజయ్ లీలా భన్సాలి ప్రాజెక్ట్ మీద చర్చలు పూర్తి చేశాడు. అది కూడా పట్టాలెక్కే అవకాశమే ఉంది. ఇంతలో లోకేష్ కనకరాజ్‌తో కూడా తను చర్చించాడు.

RAM CHARAN: రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కాదు.. గ్లోబల్ ముదురు అంటున్నారు. దానికి కారణం బన్నీ, ఎన్టీఆర్‌ని మించేలా తన ప్లానింగ్ ఉండటం. మొన్నటి వరకు త్రిబుల్ ఆర్ హిట్ తర్వాత ఆచార్య పంచ్‌తో చరణ్ డీలా పడ్డాడన్నారు. శంకర్ గేమ్ ఛేంజర్‌ని సీరియల్‌లా సాగతీయటంతో రెండేళ్లకు పైగా టైం వేస్ట్ అయ్యిందన్నారు. కానీ, బుచ్చి బాబు మూవీ, సుకుమార్ సినిమాతోపాటు చరణ్ మొన్నే సంజయ్ లీలా భన్సాలి ప్రాజెక్ట్ మీద చర్చలు పూర్తి చేశాడు.
ALLU ARJUN: మూడు జోనర్లలో.. ముగ్గురితో సినిమాకు సై అన్న బన్నీ
అది కూడా పట్టాలెక్కే అవకాశమే ఉంది. ఇంతలో లోకేష్ కనకరాజ్‌తో కూడా తను చర్చించాడు. రజినీకాంత్ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్.. ఖైదీ సీక్వెల్ తీసే అవకాశం ఉంది. ఆతర్వాత ప్రభాస్‌తో ఓ ప్రాజెక్ట్ అనుకున్నాడు లోకేష్. అది పట్టాలెక్కితే ఓకే. లేదంటే చెర్రీతో లోకేష్ మూవీ ఉండొచ్చట. బుచ్చిబాబుతో సినిమా చేయబోతున్న చరణ్, ఆ తర్వాత సంజయ్ లీలాభన్సాలి మూవీ ప్లాన్ చేసుకున్నాడు. ఈలోపు లోకేష్.. తన సినిమాల షూటింగ్ పూర్తి చేస్తాడు.
ఆతర్వాత ప్రభాస్‌తో తన సినిమా పట్టాలెక్కితే చరణ్, సుకుమార్‌తో మూవీకి మూవ్ అవుతాడట. లేదంటే లోకేష్‌తో సినిమా చేశాకే, సుకుమార్ సినిమాకు సై అంటాడట. ఇలా నాలుగు ప్రాజెక్టుల విషయంలో బన్నీ, తారక్‌ని మించిపోయాడు చరణ్.