దిల్ రాజుకు 40 కోట్లు ఇచ్చేసిన రామ్ చరణ్ అండ్ రిటర్న్ గిఫ్ట్ కూడా…?
పాన్ ఇండియా సినిమాల హడావుడి స్టార్ట్ అయిన తర్వాత నిర్మాతలు కచ్చితంగా కనపడని ఒత్తిడిలో ఉన్నారు. భారీ బడ్జెట్ సినిమాలతో ఇప్పుడు హడావుడి ఎక్కువగా నడుస్తుంది. స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ అనే ట్యాగ్ లైన్ తో రావడంతో నిర్మాతలు కూడా
పాన్ ఇండియా సినిమాల హడావుడి స్టార్ట్ అయిన తర్వాత నిర్మాతలు కచ్చితంగా కనపడని ఒత్తిడిలో ఉన్నారు. భారీ బడ్జెట్ సినిమాలతో ఇప్పుడు హడావుడి ఎక్కువగా నడుస్తుంది. స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ అనే ట్యాగ్ లైన్ తో రావడంతో నిర్మాతలు కూడా తప్పని పరిస్థితిలో ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇక కలెక్షన్లు కూడా కథ బాగుంటే భారీగా వచ్చే అవకాశం ఉండటంతో కథల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని పెట్టుబడులు పెడుతున్నారు.
అయితే రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం నిర్మాతలకు షాక్ ఇచ్చాయి. అందులో శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా మాత్రం ఊహించని దెబ్బ కొట్టింది. దాదాపు రామ్ చరణ్ హీరోగా మూడేళ్ళ తర్వాత వచ్చిన ఈ సినిమా ఇచ్చిన షాక్ కు డిస్ట్రిబ్యూటర్లు కూడా కుదేలు అయిపోయారు. ఈ సినిమా ఏ మాత్రం బాగాలేదని చాలామంది మెగా అభిమానులు కూడా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే శంకర్ పై నమ్మకంతో మెగా అభిమానులను నమ్ముకుని దిల్ రాజు ఈ సినిమా కోసం దాదాపు 450 కోట్లు ఖర్చు పెట్టారు.
సంక్రాంతి కానుకగా మూడు సినిమాలు రిలీజ్ అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఫైనల్ గా దిల్ రాజుకు ఈ సినిమా ఎన్ని కోట్ల నష్టం మిగిల్చింది అనేది మాత్రం ఇంకా లెక్కలు బయటకు రాలేదు.. ఈ సినిమా షూటింగ్ దాదాపు నాలుగేళ్లు జరగడంతో సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయింది. కానీ సినిమా కథపై ఉన్న నమ్మకంతో దిల్ రాజు భారీగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా నష్టాల నుంచి దిల్ రాజుకు తన వంతు సహకారం అందించేందుకు రాంచరణ్ రెడీ అయ్యాడు.
ఈ సినిమా కోసం మెగా పవర్ స్టార్ దాదాపు 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. అందులో 40 కోట్లు తిరిగి ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాడట. అలాగే ఫ్యూచర్లో ఒక మంచి కథతో దిల్ రాజుకు ఒక సినిమా చేయడానికి రాంచరణ్ రెడీగా ఉన్నట్లు సమాచారం. ఒక యంగ్ డైరెక్టర్ తో ఒక పవర్ ఫుల్ కథతో సినిమా చేయాలని ఎప్పటినుంచొ ప్రయత్నాలు చేస్తున్న రాంచరణ్ ఆ సినిమాను దిల్ రాజు బ్యానర్ లో చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ముందు బుచ్చిబాబుతో సినిమా కంప్లీట్ చేసిన తర్వాత సుకుమార్ డైరెక్షన్లో ఒక భారీ బడ్జెట్ సినిమా లైన్ లో పెట్టాడు. ఆ తర్వాత కచ్చితంగా దిల్ రాజుతో సినిమా చేయడానికి రామ్ చరణ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ సినిమా గురించి అనౌన్స్మెంట్ మాత్రం ఎర్లీగానే ఇవ్వటానికి రామ్ చరణ్ రెడీ అయ్యాడట.