Ram Charan : పవన్ కారు డోర్ తీసిన రామ్ చరణ్
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం చాలా కొంతమందికి మాత్రమే అలవాటు అవుతుంది. ఎంత ఎత్తుకు ఎదిగాం అన్నది కాదు.. గర్వం తలకెక్కకుండా ఉన్నామా అనేది ముఖ్యం. ఎలాంటి గర్వం లేకుండా ఇండస్ట్రీలో ఉన్న అతికొంతమంది స్టార్స్ లో మెగాస్టార్ మొదటి వరుసలో ఉంటాడు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం చాలా కొంతమందికి మాత్రమే అలవాటు అవుతుంది. ఎంత ఎత్తుకు ఎదిగాం అన్నది కాదు.. గర్వం తలకెక్కకుండా ఉన్నామా అనేది ముఖ్యం. ఎలాంటి గర్వం లేకుండా ఇండస్ట్రీలో ఉన్న అతికొంతమంది స్టార్స్ లో మెగాస్టార్ మొదటి వరుసలో ఉంటాడు. ఇండస్ట్రీ పెద్దగా ఎవరికి ఏ సహాయం చేయాలన్నా ముందు ఉంటాడు. అభిమానులను ఆప్యాయంగా పలరిస్తూ ఉంటాడు. కష్టం విలువ తెల్సిన మనిషి.. ఇక ఈ గుణాలన్నీ తండ్రి దగ్గర నుంచి పుణికిపుచ్చుకున్నాడు రామ్ చరణ్ (Ram Charan).
మెగా వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మొదట లుక్స్ బాలేదని ట్రోల్ చేసారు.. ఆ తరువాత ఎక్స్ ప్రెషన్స్ రావు అని హేళన చేశారు.. ఇలా ఎన్ని ట్రోల్స్ చేసినా చరణ్.. ఏవి పట్టించుకోకుండా ముందుకు కొనసాగాడు. విభిన్నమైన కథలను ఎంచుకోని.. స్టార్ గా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారాడు. ఇక గ్లోబల్ స్టార్ (Global Star) గా మారినా.. కుటుంబంలో ఎప్పుడు చిన్న కొడుకే అని నిరూపించాడు.
చిన్నతనం నుంచి తండ్రి కన్నా ఎక్కువ బాబాయ్ తో పెరిగిన అనుబంధం అయ్యి ఉండవచ్చు.. ఎప్పుడు పవన్ తో చరణ్ కున్న బాండింగ్ స్పెషల్ గా ఉంటుంది. చిరు – చరణ్ కలిసినప్పుడు కన్నా.. బాబాయ్- అబ్బాయ్ కలిసినప్పుడు ఉండే కిక్ వేరేలా ఉంటుంది. ఇక చరణ్.. తండ్రిని, బాబాయ్ ను ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోడు. పవన్ జనసేన (Janasena) పార్టీని స్థాపించనప్పటినుంచి.. డైరెక్ట్ గానో, ఇన్ డైరెక్ట్ గానో ఆయనకు వెన్నంటే ఉంటూ వస్తున్నాడు. కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడ్డాడు. సంతోషం వచ్చినప్పుడు సంబరాలు చేశాడు.
ఇక నేడు కూడా బాబాయ్ కు విధేయతగా ఉన్న చరణ్ వ్యక్తిత్వాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్న పవన్.. మెగాస్టార్ ఇంటికి విచ్చేసి ఆయన ఆశీస్సులు అందుకున్న విషయం తెల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో పవన్ ను గేటు దగ్గర నుంచే రిసీవ్ చేసుకున్నాడు చరణ్. బాబాయ్- పిన్ని ఆశీస్సులు తీసుకొని.. వారిని లోనికి ఆహ్వానించాడు. కేక్ కట్ చేయించి తండ్రి, బాబాయ్ ల పక్కన హుందాగా నిలబడ్డాడు.
అంతేకాకుండా పవన్ ను బయలుదేరినప్పుడు కూడా ఆయనకు విషెస్ చెప్పి.. కారు డోర్ తీసి మరీ ఆయనకు సెండాఫ్ ఇచ్చాడు. నిజంగా ఒక స్టార్ హీరో అయ్యి ఉండి కూడా అక్కడ అంత చేయాల్సిన అవసరం లేకపోయినా.. బాబాయ్ మీద ఉన్న ప్రేమ, మెగా వారసుడుగా ఆ బాధ్యతను చరణ్ ఎంతో చక్కగా నిర్వర్తించాడు. ఇక్కడే కాదు.. అభిమానులతో కూడా చరణ్ అంతే బాధ్యతగా ఉంటాడు. మొన్నటికి మొన్న పిఠాపురంలో చుట్టూ అభిమానులు చుట్టేసినా.. కోపగించుకోకుండా.. అతి కష్టం మీద బయటకు వచ్చి.. వారిని ఏమి చేయకండి అని సెక్యూరిటీకి చెప్పి నవ్వుకుంటూ వెళ్ళాడు. అది చరణ్ సంస్కారం. ఇప్పుడు కూడా అంతే సంస్కారంతో బాబాయ్ ను సాగనంపాడు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు వ్వా.. ఏం కొడుకును కన్నావయ్యా చిరంజీవి.. శభాష్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.