Upasana : నన్ను బాడీ షేమింగ్ చేశారు.. ఉపాసన ఎమోషనల్..
మెగా కోడలిగానే కాకుండా బిజినెస్ ఉమెన్‌గా, సోషల్ యాక్టివిటీస్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు ఉపాసన. సినిమాల్లో చెర్రీ ఎలాంటి క్రేజ్ సంపాదిస్తున్నాడో.. బిజినెస్‌లో ఉపాసన కూడా అలాగే దూసుకెళ్తున్నారు. చరణ్‌ను పెళ్లి చేసుకోవడంతో ప్రపంచానికి పరిచయమైన ఉపాసన.. మొదట్లో చాలా ట్రోలింగ్‌ను ఎదుర్కున్నారు.
రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కున్న ట్రోలింగ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు ఉపాసన. చాలా లావుగా ఉందంటూ.. చూసేందుకు అబ్బాయిలా ఉందంటూ అప్పట్లో ఉపాసనపై ఇంటర్నెట్లో చాలా ట్రోలింగ్స్ వచ్చాయి. చరణ్ కూడా కేవలం డబ్బు కోసమే ఉపాసనను పెళ్లి చేసుకున్నాడని కూడా చాలా మంది అప్పట్లో మాట్లాడుకున్నారు. అవి చూసిన ప్రతీసారి ఉపాసన చాలా బాధపడేవారట. కానీ ఎప్పుడూ ఎవరి మీద ఆమెకు కోపం వచ్చేది కాదట.
తన గురించి తెలియదు కాబట్టే అలా మట్లాడుతున్నారని ఊరుకునేదట. చరణ్‌ను పెళ్లి చేసుకున్న తరువాత ఇన్‌స్టగ్రామ్ ద్వారా మెగా ఫ్యాన్స్‌కు చాలా దగ్గరయ్యారు ఉపాసన. తన బిజినెస్ గురించి, తాను చేస్తున్న సోషల్ యాక్టివిటీస్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెట్టేవారు. ప్రతీ నిమిషం భర్త వెంటే ఉంటూ.. అన్ని విషయాల్లో చెర్రీకి సపోర్ట్‌గా ఉండేవారు. ఉపాసన క్యారెక్టర్ గురించి.. ఆమె మంచితనం గురించి తెలిసిన తరువాత ఆమె గురించి అందరి మైండ్‌సెట్ మారిపోయింది. అప్పటి నుంచి ట్రోలింగ్స్ రాలేదట. ఇప్పుడు చరణ్‌ను ఎంత అభిమానిస్తున్నారో తనకు కూడా అంతే అభిమానం లభిస్తోందని చెప్పారు ఉపాసన. పక్కవాళ్లు చేస్తున్న ట్రోలింగ్స్‌ను పట్టించుకుని ఉంటే.. ఈ స్థాయికి, ఇంత సంతోషంగా వచ్చేవాళ్లం కాదని చెప్పారు.