Ram Charan: ఉపాసన అరుదైన రికార్డ్‌.. ఇందుకేగా మెగా కోడలు అయ్యింది..

మెగా కోడలు ఉపాసన కొణిదెల తెలుగు ప్రజలకు పరిచయం అవసరంలేని పర్సన్‌. రామ్ చరణ్‌ భార్యగానే కాకుండా.. అపోలో ఫౌండేషన్‌ వైస్‌ చర్‌పర్సన్‌గా ఉపాసనకు మంచి గుర్తింపు ఉంది. తన సేవా కార్యక్రమాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు ఉపాసన. అయితే ఈ మెగా కోడలు రీసెంట్‌గా ఓ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2023 | 02:30 PMLast Updated on: Mar 25, 2023 | 2:30 PM

Ram Charan Wife Upasana Social Service

“మోస్ట్‌ ప్రామిసింగ్‌ బిజినెస్‌ లీడర్స్‌ ఆసియా” జాబితాలో నిలిచారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. రీసెంట్‌గానే ఆస్కార్‌ విజయంతో మెగా ఫ్యామిలీ ఫుల్‌ జోష్‌లో ఉంది. ఇప్పుడు ఉపాసన కూడా ఇలాంటి రేర్‌ రికార్డ్‌ సాధించడంతో మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. చిన్నప్పటి నుంచే వ్యాపారంలో మెలకువలు నేర్చుకున్న ఉపాసన మంచి బిజినెస్‌ ఉమెన్‌. బిజినెస్‌ మాత్రమే కాదు.. సేవా కార్యక్రమాల్లో కూడా ఉపాసన ముందుంటారు. “యూ ఎక్సేంజ్‌” అనే సేవా కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు ఉపాసన.

పాత పుస్తకాలు సేకరిచి బస్తీల్లో చదివే పిల్లలకు అందిస్తున్నారు. మురికి వాడల్లో ఉండే ప్రజలకు అపోలో హెల్త్‌ సిటీలో ఉచితంగా వైద్యం కూడా అందిస్తున్నారు. ఓ పక్క పర్సనల్‌ లైఫ్‌ లీడ్‌ చేస్తూ.. అటు బిజినెస్‌, ఇటు సోషల్‌ సర్వీస్‌ను హ్యాండిల్‌ చేస్తున్నారు ఉపాసన. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా హెల్త్‌ విషయంలో అవగాహన కల్పించడమే కాకుండా.. బి పాజిటివ్‌ అనే హెల్త్‌ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆమె సాధించిన ఈ ఘనతతో మెగా కుటుంబ సభ్యులే కాక.. మెగా అభిమానులు కూడా ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.