Ram Charan: బాలీవుడ్ హీరోయిన్ కూతురితో చరణ్ ఆన్‌స్క్రీన్ రొమాన్స్..!
తన హీరోయిన్ ఒక మూవీలో నటిగా, మరో మూవీలో ఐటమ్ గాళ్‌గా కనిపిస్తే.. ఇక తన మూవీలో ఏం ఎగ్జైట్‌మెంట్ ఉంటుందనే కారణంతో పక్కనపెట్టారట. మరి బుచ్చిబాబు మేకింగ్‌లో రామ్ చరణ్ చేసే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో హీరోయిన్ ఎవరు..?

Ram Charan: రామ్ చరణ్ ఇప్పుడు అతిలోక సుందరి శ్రీదేవి కూతురికి హ్యాండ్ ఇచ్చాడు. దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తను ఆ సినిమా షూటింగ్‌తో బిజీ అవుతున్న వేళ.. మెగా ఆఫర్ మిస్ అవ్వటం హాట్ టాపిక్ అయ్యింది. దీనంతటికీ పుష్ప 2లో తను ఐటమ్ సాంగ్ చేయడమే కారణం అంటున్నారు. పుష్ప 2లో ఐటమ్ సాంగ్ ఇంకా షూట్ చేయలేదు. జాన్వీనే ఆ పాట చేస్తుందన్న ప్రచారం తప్ప.. ఏదీ ఇంకా అఫీషియల్‌గా కన్ఫామ్ కాలేదు. ఈలోపే జాన్వీ కపూర్‌ని చరణ్ రిజెక్ట్ చేయటం వెనక కారణం ఉందంటున్నారు.
తన హీరోయిన్ ఒక మూవీలో నటిగా, మరో మూవీలో ఐటమ్ గాళ్‌గా కనిపిస్తే.. ఇక తన మూవీలో ఏం ఎగ్జైట్‌మెంట్ ఉంటుందనే కారణంతో పక్కనపెట్టారట. మరి బుచ్చిబాబు మేకింగ్‌లో రామ్ చరణ్ చేసే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో హీరోయిన్ ఎవరు..? ఈ ప్రశ్నకి ఆన్సర్ శ్రీదేవి కూతురు కాదు. మరో బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడాని. తెలుగులో బాలయ్య, నాగ్‌తో జోడీకట్టి అప్పట్లో తెలుగు తెరమీద వెలిగిన రవీనా టాండన్ కూతురు రీసెంట్‌గా హైదరాబాద్ వచ్చింది. రామ్ చరణ్ మూవీ కోసం ఫోటో షూట్, టెస్ట్ కట్ ఇచ్చింది.
తను ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. స్పెషల్ ఎనౌన్స్ మెంట్‌ని దసరాకు ప్లాన్ చేసుకున్నాడట బుచ్చిబాబు. సో.. అది అప్పుడే రివీల్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. కాని ఈలోపే మ్యాటర్ లీకైపోయింది. దీంతొ రషా తడాని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.